Hyderabad: పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
హైదరాబాదీలు జర అలెర్ట్.! ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లు ఉన్నాయని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దీనిపై ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. అదేంటి.? ఆ వివరాలు ఏంటో.? ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.? ఆ వివరాలు
హైదరాబాద్‌లో ఇటీవల సోషల్ మీడియాలో ‘ట్రాఫిక్ చలాన్ల పై భారీ డిస్కౌంట్’ అనే పేరు మీద ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ ఫేక్ వార్త ప్రకారం, ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్నట్లు వైరల్ చేస్తున్నారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇది పూర్తిగా ఫేక్ వార్తగా తేల్చేసారు. గతంలో ఈ తరహాలో డిస్కౌంట్‌లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఈసారి వైరల్ అవుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
వైరల్ అవుతున్న ఫేక్ వార్త ఇదే:-
టూ-వీలర్స్: 80% డిస్కౌంట్. ఉదాహరణకు, ₹700 ఫైన్ ఉంటే, కేవలం ₹140 చెల్లిస్తే చాలు
కార్లు (ప్రైవేట్): 60% డిస్కౌంట్. ఉదాహరణకు, ₹2000 ఫైన్ ఉంటే, కేవలం ₹800 చెల్లిస్తే చాలు
ఇవి కూడా చదవండి
ఆఫర్ డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఫేక్ వార్తను క్రియేట్ చేసారు. ఈ వార్తను చూసి చాలామంది ఈ ఆఫర్ నిజమని అనుకుని, చలాన్లు క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ తెలంగాణ పోలీస్ విభాగం దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ విషయం పై పోలీసులు క్లారిటీ ఇచ్చేసారు. చలాన్లపై డిస్కౌంట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని పోలీసులు స్పష్టం చేసారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న డిస్కౌంట్ ఆఫర్ పూర్తిగా తప్పుడు సమాచారం. ఈ తరహా సమాచారం నమ్మకూడదు.
అలాగే ఎవరైనా ఈ తరహా ఫేక్ వార్తలు షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీ ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేయడానికై అధికారిక వెబ్‌సైట్ అయిన echallan.tspolice.gov.in ను మాత్రమే ఉపయోగించండి. ఈ విధమైన తప్పుడు సమాచారాన్ని నమ్మి, మీకు లాభం కలిగిందని భావించవద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ ఫేక్ వార్తలో పోలీస్ లోగో, అధికారిక స్టాంపులు వంటి వాటిని ఉపయోగించి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. ‘FAKE’ అని Telangana State Police స్పష్టంగా వాటిపై ముద్రించినట్లు ఉన్నా, ఇప్పటికీ ఇది చాలామందిని కన్‌ఫ్యూజ్ చేస్తోందని తెలంగాణ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇది చదవండి: డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికొచ్చిన వ్యక్తి.. గుమ్మం దగ్గర కనిపించింది చూడగా
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి