AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vladimir Putin: రష్యా అధ్యక్షుడి ఆరోగ్యం బాగానే ఉందా..? ఆయనపై ఇలాంటి వార్తలు రావడానికి కారణం ఏమిటి..?

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోగ్య పరిస్థితి మరోసారి చర్చనియాంశమయింది. ఇటీవల క్యూబా అధ్యక్షుడితో చర్చలు జరిపిన సమయంలో తీసిన ఫొటోల్లో ఆయన చేతులు రంగుమారి కనిపించాయి. దీనికి కారణం ఏంటని..

Vladimir Putin: రష్యా అధ్యక్షుడి ఆరోగ్యం బాగానే ఉందా..? ఆయనపై ఇలాంటి వార్తలు రావడానికి కారణం ఏమిటి..?
Vladimir Putin And Miguel
శివలీల గోపి తుల్వా
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 26, 2022 | 2:20 PM

Share

ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధం మొదలయిన నాటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోగ్యంపై అనేక వార్తాకథనాలు వెలువడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరోసారి చర్చనియాంశమయింది. ఇటీవల క్యూబా అధ్యక్షుడితో చర్చలు జరిపిన సమయంలో తీసిన ఫొటోల్లో ఆయన చేతులు రంగుమారి కనిపించాయి. దీనికి కారణం ఏంటని సామాజిక మాధ్యమాల్లో అనేక చర్చలు మొదలయ్యాయి. పుతిన్‌ పార్కిన్సన్స్‌తో బాధపడుతున్నట్లు కూడా కొన్ని వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, క్యూబా అధ్యక్షుడు మిగుయేల్‌ డియాజ్‌ కానెల్‌ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పశ్చిమ దేశాలకు అమెరికా ఇస్తోన్న అనుమతులపై ప్రధానంగా వారు చర్చించారు.

ఈ సమావేశాల మాట పక్కన పెడితే.. ఇరు దేశాల అధ్యక్షులు కరచాలనం చేస్తున్న సందర్భంలో క్లిక్‌మన్న ఫొటోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ ఫొటోల్లో పుతిన్‌ చేతులు రంగు మారడమే అందుకు కారణం. ఆయన చేతులు పర్పుల్‌ రంగులో కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై మరోసారి సామాజిక మాధ్యమాల వేదికగా చర్చ మొదలైంది. అలాగే పుతిన్ కుర్చీని ఒక చేత్తో గట్టిగా పట్టుకుని కూర్చోవడం వీడియోలో రికార్డయ్యింది.

ప్రముఖ వార్తాసంస్థ ది మిర్రర్ కథనం ప్రకారం.. రష్యా, క్యూబా అధ్యక్షుల సమావేశంలో పుతిన్ ముఖం పాలిపోయినట్లు , అతని శరీరం ఉబ్బినట్లు కనిపించింది. క్యూబా నాయకుడితో చర్చలో పుతిన్ పూర్తిగా అసౌకర్యంగా కనిపించారు. ఆ సమయంలో పుతిన్ పాదాలు కంటిన్యూగా వణుకుతున్నాయి. ఈ పరిస్తితులను గమనిస్తే.. అతడు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుసుందని పేర్కొంది. కాగా, రష్యా అధ్యక్షుడు కొంత తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని ఈ నెల ప్రారంభంలో కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ ఆర్మీ మాజీ అధికారి, హౌస్‌ సభ్యుడు లార్డ్స్‌ రిచర్డ్‌ దనత్‌ స్పందించారు. చేతులపై ఉన్న మచ్చలను నిశితంగా పరిశీలిస్తే.. ఇంజక్షన్‌ సూదులు గుచ్చడం వల్ల ఏర్పడినట్లుగా కనిపిస్తోందని అన్నారు. దానివల్లే బహుశా చేతులు రంగుమారి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఇటీవల ఆయన చేతులపై నలుపు రంగు మచ్చలు కనిపించడం కూడా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచీ ఆయన పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. క్రమంగా అతని ఆరోగ్యం దిగజారిందని, యుద్ధ ఒత్తిడి కారణంగా అతని ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోందని వాటి సారంశం. పుతిన్‌కు ప్రాణాంతక వ్యాధి ఉందని, దాని కారణంగా అతని జీర్ణవ్యవస్థ కూడా ప్రభావితమవుతుందని కూడా వార్తా కధనాలు వెల్లడించాయి. రష్యా అధ్యక్షుడు క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారని కొన్ని నెలల క్రితం, యుఎస్ ఇంటెలిజెన్స్ నివేదించింది.

కుర్చీని పట్టుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వీడియో..

అయితే, 2022 జూలైలో అమెరికా అత్యున్నత నిఘా సంస్థ సీఐఏ అధిపతి విలియమ్‌ బర్న్స్‌ కొలరాడోలో జరిగిన ఆస్పార్న్‌ సెక్యూర్టీ ఫోరంలో మాట్లాడుతూ.. పుతిన్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తేల్చి చెప్పారు. ఇటీవలే 71వ వడిలోకి అడుగుపెట్టిన పుతిన్ వయస్సు రీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండటం సహజం కానీ ఉక్రెయిన్‌పై యుద్దానికి దిగినప్పటి నుంచీ పుతిన్‌ ఆరోగ్యం హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఈ ప్రచారాలను రష్యా అధికారులు ఖండిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ పుతిన్‌ అనారోగ్యంపై కొత్త కొత్త అనుమానాలు వెలువడుతూనే ఉన్నాయి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..