Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ జాకెట్ వేసుకున్న మహిళలను టచ్ చేశారా.. కరెంట్ షాక్ కొట్టి పోతారు..

సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలోనూ మహిళలపై దాడులు, అఘాయిత్యాలు అధికమైపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. నేరాలను అదుపు చేయడం కష్టంగా మారింది. దీంతో టెక్నాలజీని..

ఆ జాకెట్ వేసుకున్న మహిళలను టచ్ చేశారా.. కరెంట్ షాక్ కొట్టి పోతారు..
Smart Jacket
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 26, 2022 | 5:55 PM

సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలోనూ మహిళలపై దాడులు, అఘాయిత్యాలు అధికమైపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. నేరాలను అదుపు చేయడం కష్టంగా మారింది. దీంతో టెక్నాలజీని ఉపయోగించి మహిళల భద్రత కోసం స్మార్ట్ జాకెట్ తయారుచేశారు కొంతమంది విద్యార్థులు. ఈ జాకెట్ వేసుకున్న మహిళలకు ఇక తమపై ఎవరో దాడి చేస్తారు.. అఘాయిత్యాలకు పాల్పడతారనే భయమే అవసరం లేదు. తమ జోలికి వచ్చే వారిని భయపెట్టేలా చేస్తుంది ఈ స్మార్ట్ జాకెట్. మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు, దాడులు పెరిగిపోతున్నాయి. మహిళల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా నేరస్తుల్లో మార్పు రావడం లేదు. దీంతో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మహిళల భద్రత కోసం స్మార్ట్ జాకెట్ తయారు చేశారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు స్మార్ట్ సొల్యూషన్‌తో ముందుకు వచ్చారు ఈ ఇంజినీరింగ్ విద్యార్థులు. దురుద్దేశంతో మహిళలను బలవంతం చేసినప్పుడు, వారిని టచ్ చేసి ఇబ్బందులకు గురిచేసే ఆకతాయిలకు తగిన గుణపాఠం చెప్పేలా స్మార్ట్ జాకెట్‌ను రూపొందించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌కి చెందిన విద్యార్థులు ఈ స్మార్ట్ జాకెట్‌ను రూపొందించారు. స్మార్ట్ జాకెట్ ధరించిన మహిళలపై ఎవరైనా చేయి వేయడానికి ప్రయత్నిస్తే వెంటనే విద్యుత్తు షాక్ తగులుతుంది. అవతలి వ్యక్తి బలవంతంగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అదే స్థాయిలో విద్యుత్తు షాక్‌కు గురౌతాడు. ఒక మహిళపై ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే లైవ్ రికార్డింగ్ కోసం ఈ స్మార్ట్‌ జాకెట్‌లో చిన్న చిన్న కెమోరాలను అమర్చారు. దీంతో నిందితుడిని గుర్తించడం సులభతరమవుతుంది.

ఈ స్మార్ట్ జాకెట్‌ను తయారు చేసేందుకు విద్యార్థులు వైర్లు, సెన్సార్లు, ట్రాన్స్‌మిటర్లు, కెమెరాలు, బ్యాటరీలు, బ్లూటూత్ మైక్రోఫోన్లు, మెటల్ షీట్‌లను ఉపయోగించారు. ఇది ఉపయోగించే మహిళల భద్రత కోసం, రెండు కెమెరాలు ఏర్పాటు చేశారు. జాకెట్ ముందు వైపు ఒకటి, వెనుక వైపు మరో కెమెరా అమర్చారు. దుండగులు ఎటువైపు నుంచి వచ్చినా వారిని గుర్తించేందుకు వీలుగా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ జాకెట్ 200 నుండి 4000 వోల్ట్ల వరకు విద్యుత్ షాక్‌లను ఉత్పత్తి చేస్తుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ వినిత్‌రాయ్ తెలిపారు. అర్థరాత్రి సమయాల్లో తమ పని ముగించుకుని ఇళ్లకు వెళ్లే మహిళల భద్రతే ప్రధాన ఉద్దేశంగా ఈ జాకెట్లను రూపొందించామని వీటి రూపకల్పనలో భాగస్వాములైన విద్యార్థులు తెలిపారు. లేట్ షిఫ్ట్‌లలో పనిచేసే మహిళలు తమ భద్రత గురించి భయపడుతున్న విషయాన్ని గమనించి ఈ స్మార్ట్ జాకెట్‌ను తయారుచేశారు.

ఈ స్మార్ట్ జాకెట్‌తో భద్రతపై భయం అవసరం లేదని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి తగిన గుణపాఠం చెబుతుందంటున్నారు ఆవిష్కర్తల బృందంలోని విద్యార్థులు. ఈ జాకెట్‌ వేసుకున్న మహిళలపై దాడులకు యత్నించేవారు వెంటనే విద్యుత్తు షాక్‌కు గురౌతారు. అయితే ఈ కరెంట్‌షాక్‌తో ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు. కొద్దిసేపటి తర్వాత సురక్షితంగా వ్యక్తి బయటపడటానికి వీలుగా దీనిని రూపొందించారు. ఈ స్మార్ట్ జాకెట్ 200 నుండి 4000 వోల్ట్ల వరకు విద్యుత్ షాక్‌లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉండగా.. ఏ సమయంలో ఎంత వొల్ట్లల విద్యుత్తును విద్యుత్తును ఉత్పత్తి చేయాలో జాకెట్ వేసుకున్న వ్యక్తులు సెట్టింగ్స్‌ ఆప్షన్‌లో సెట్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..