AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: రచ్చ రాజేస్తున్న కేంద్రమంత్రి ట్వీట్.. భగ్గుమంటున్న కాంగ్రెస్ శ్రేణులు..

రాహుల్‌గాంధీని ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమంటున్నాయి. భారత్‌ జోడో యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర చేస్తున్నారు రాహుల్‌. ఓంకారేశ్వర్ ఆలయం దగ్గర నర్మదా నదీ తీరాన..

Rahul Gandhi: రచ్చ రాజేస్తున్న కేంద్రమంత్రి ట్వీట్.. భగ్గుమంటున్న కాంగ్రెస్ శ్రేణులు..
Smriti Irani, Union Minister
Amarnadh Daneti
|

Updated on: Nov 26, 2022 | 8:10 PM

Share

రాహుల్‌గాంధీని ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమంటున్నాయి. భారత్‌ జోడో యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర చేస్తున్నారు రాహుల్‌. ఓంకారేశ్వర్ ఆలయం దగ్గర నర్మదా నదీ తీరాన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి ఇస్తున్న ఫోటోని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఓంకారేశ్వర ఆలయాన్ని దర్శించడం ఎంతో ఆనందం కలిగించిందని, ఆ తరవాత నర్మదా హారతి కార్యక్రమంలోనూ పాల్గొన్నానంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ హారతి ఇచ్చే సమయంలో ఆయన ఓ శాలువాను కప్పుకున్నారు. దానిపై ఓంకార ముద్రలు ఉన్నాయి. ఈ ఫోటోని రీట్వీట్ చేస్తూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాహుల్‌పై సెటైర్లు విసిరారు. రాహుల్ కప్పుకున్న శాలువాపై ఓంకార ముద్రలు రివర్స్‌లో ఉన్నాయంటూ ఆ ఫోటోని రొటేట్ చేస్తూ స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. ఇప్పుడు సరిగా ఉంది అని ట్విటర్‌లో రాహుల్‌గాంధీ ఫోటోను రివర్స్‌లో పెట్టి షేర్ చేశారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. స్మృతి ఇరానీపై కాంగ్రెస్‌ నేతలు కౌంటర్లు మొదలుపెట్టారు. సిలిండర్‌ ధర రూ. 400 ఉన్నప్పుడు స్మృతి ఇరానీ చేసిన ధర్నా ఫోటోను షేర్‌ చేస్తూ ఇప్పుడు గ్యాస్‌ ధర రూ. 1100కు చేరిందని ఆమె ఫోటోను కూడా రివర్స్‌లో పెట్టి కౌంటరిస్తున్నారు.

హిందూ ఆచారాలను అవమానిస్తున్నారంటూ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్మృతి ఇరానీపై విమర్శలు చేశారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ.. రాహుల్‌ గాంధీని ట్రోల్ చేసి “కిరీటం” సాధించుకున్నారు. ఇప్పుడు హిందూ ఆచారాలను ట్రోల్ చేస్తూ స్మృతి ఇరానీ ఆ కిరీటాన్ని ఆయన దగ్గర నుంచి లాగేసుకున్నారంటూ కౌంటర్ వేశారు ప్రియాంక చతుర్వేది.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ ప్రతినిధి లావణ్య బలాల్ కూడా స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీపై మీకున్న విద్వేషం తారస్థాయికి చేరుకుందని మండి పడ్డారు. పార్సీ మతస్తురాలు కావడం తోనే రాహుల్‌గాంధీని స్మృతి టార్గెట్‌ చేశారని ఆమె ట్వీట్‌ చేశారు. తనకు కేటాయించిన శాఖ తప్ప పనికిరాని అన్ని విషయాల్లో స్మృతి ఇరానీ తలదూరుస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్‌ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..