అన్నంలో చీమలు ఎలా పడ్డాయని అడిగినందుకు.. భర్తను హతమార్చిన భార్య..

కుటుంబంలో ఏర్పడే చిన్న చిన్న తగదాలు.. చిలికి చిలికి గాలివానగా మారతాయి. ముఖ్యంగా భార్య, భర్తల మధ్య ఏర్పడే ఘర్షణల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరో ఒకరు వెనక్కి తగ్గి ఘర్షణకు..

అన్నంలో చీమలు ఎలా పడ్డాయని అడిగినందుకు.. భర్తను హతమార్చిన భార్య..
Ants (Representational Image)
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 26, 2022 | 8:44 PM

కుటుంబంలో ఏర్పడే చిన్న చిన్న తగదాలు.. చిలికి చిలికి గాలివానగా మారతాయి. ముఖ్యంగా భార్య, భర్తల మధ్య ఏర్పడే ఘర్షణల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరో ఒకరు వెనక్కి తగ్గి ఘర్షణకు ముగింపు పలకాలి. లేకపోతే ఆ ఘర్షణ తీవ్ర అనార్థాలకు దారితీస్తుంది. కుటుంబంలో భార్య, భర్తల మధ్య ఏర్పడిన తగదాలు.. తారాస్థాయికి చేరుకుని.. ప్రాణాలు తీసుకునే స్థాయికి దారితీసిన ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా ఒడిశాలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. భార్య, భర్తల మధ్య ఏర్పడిన చిన్నపాటి తగదా.. తీవ్ర స్థాయికి చేరుకుని.. హత్యకు దారి తీసింది. కుటుంబంలో ఘర్షణలు ఏర్పడిన సమయంలో ప్రతి ఒక్కరూ ఇగో ఫీలింగ్‌తో ఒకడుగు వెనక్కివేయడానికి సంచయిస్తూ ఉంటారు. తాను వెనక్కి తగ్గితే అవతలివాడు గొప్పగా ఫీలవుతాడనే ఆలోచన కలిగి ఉంటారు కొంతమంది. ఇలాంటి సందర్భాల్లో కుటుంబంలో ఏర్పడిన తగాదాలు ఒక్కోసారి బంధాన్ని తెంచుకునేందుకు కూడా వెనుకాడరు. అదే ఘర్షణల సమయంలో ఎవరో ఒకరూ పాజిటివ్ థింకింగ్‌తో ఒకడుగు వెనక్కి తగ్గితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది. ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లాలో భార్య, భర్తల మధ్య ఏర్పడిన చిన్న తగాదా హత్యకు దారి తీయడంతో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నంలో చీమలు ఎలా పడ్డాయని భార్యను అడిగినందుకు భర్తను చంపేసిన ఘటన ఒడిశా రాష్ట్రం సుందర్‌గఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హేమంతా బాఘ్(35), సరిత(30) ఇద్దరు భార్యా, భర్తలు వీరికి ఇద్దరు కుమార్తెలు హేమలత, సౌమ్య ఉన్నారు. హేమంత్ ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తుండగా అన్నంలో చీమలు కనిపించడంతో భార్యను భర్త ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ తగాదా తారాస్థాయికి చేరుకోవడంతో క్షణికావేశంలో భర్త గొంతు నులిమి భార్య చంపేసింది. హేమంత్ తండ్రి శశిభూషణ్ భాఘ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సరితను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..