Video: సినీ ఫక్కీలో దోపిడి.. గాల్లోకి కాల్పులు.. పెట్రోల్ పంపు ఉద్యోగి నుంచి నగదు చోరీ..
కొంతమంది అబద్ధం ఆడాలంటేనే భయపడిపోతూ ఉంటారు. నేరం అంటే అయ్యో మావల్ల కాదంటారు. కాని కొందరు మాత్రం ఎటువంటి భయం లేకుండా తేలికగా చోరీలు చేసేస్తూ ఉంటారు. చుట్టు పక్కల జనం ఉన్నా.. అవసరమైతే..
కొంతమంది అబద్ధం ఆడాలంటేనే భయపడిపోతూ ఉంటారు. నేరం అంటే అయ్యో మావల్ల కాదంటారు. కాని కొందరు మాత్రం ఎటువంటి భయం లేకుండా తేలికగా చోరీలు చేసేస్తూ ఉంటారు. చుట్టు పక్కల జనం ఉన్నా.. అవసరమైతే ఆయుధాలు ఉపయోగించి చోరీలకు పాల్పడతారు. ఇటీవల కాలంలో తుపాకీలతో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో దోపిడీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. భద్రతను కట్టుదిట్టం చేసినా, సిసి కెమెరాల్లో తమ కదలికలు రికార్డవుతున్నాయని తెలిసినా కొంతమంది మాత్రం దోపిడీలను అలవాటుగా చేసుకుని.. పగలు, రాత్రి తేడా లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం పంజాబ్‌లో పట్టపగలే తుపాకితో బెదిరించి మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన మర్చిపోకముందే.. అలాంటి ఘటనలు మరిన్ని జరుగుతున్నాయి. పంజాబ్‌లో దోపిడిలు, హత్యా నేరాలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. గతంలోనూ ఇటువంటి కల్చర్ పంజాబ్‌లో ఉన్నప్పటికి. ఈ మధ్య కాలంలో నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండోర్-ఖాండ్వా రహదారిపై ఉన్న భారత్ పెట్రోలియం పంపు వద్ద ఇద్దరు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. సిమ్రోల్ ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు గాలిలోకి కాల్పులు జరిపి పెట్రోల్ పంపు ఉద్యోగి నుంచి రూ.30 వేలు దోచుకెళ్లారు. నిందితులు పెట్రోల్ పంప్‌లోని ఉద్యోగి నుంచి నగదు లాక్కుంటుండగా.. సదరు ఉద్యోగి ప్రతిఘటించగా.. కొట్టి మరీ నగదు లాక్కున్నారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు కావడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ బైక్ పై వచ్చారు. వారిలో ఒకరు పెట్రోల్ కొట్టించుకుని రాగా.. మరో ఇద్దరు పెట్రోల్ బంక్ దగ్గర అటు ఇటు తిరుగుతూ కన్పించారు. పెట్రోల్ కొట్టించుకుని వచ్చిన తర్వాత.. ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ పంపు ఉద్యోగి వద్దకు వచ్చి సిబ్బందిని కొట్టడంతోపాటు గాలిలోకి కాల్పులు జరిపారు.
పెట్రోల్ పంప్ సిబ్బందిని బెదిరించి వారి వద్ద ఉన్న క్యాష్ బ్యాగు లాక్కెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగి 24 గంటలు గడిచినా నిందితులను పోలీసులు గుర్తించలేకపోయారు.
इंदौर के पास सिमरोल में पेट्रोल पंप पर लूट, बदमाशों ने किए फायर pic.twitter.com/d8DOajJl6g
— NaiDunia (@Nai_Dunia) November 25, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..