Telugu News Photo Gallery BJP Senior Leader B L Santosh Busy in Gujarat assembly elections, He visit Bardoli Sardar Patel National Museum and pay Tributes to Vallabhbhai Patel
Gujarat Elections 2022: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిఎల్.సంతోష్ బిజీ.. ట్విట్టర్లో ఫోటోలు షేర్ చేసిన బీజేపీ నేత..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బిఎల్.సంతోష్ గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. గత కొద్దిరోజులగా ఆయన గుజరాత్‌లోనే మకాం వేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో..
B L Santosh
Follow us
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బిఎల్.సంతోష్ గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. గత కొద్దిరోజులగా ఆయన గుజరాత్‌లోనే మకాం వేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే నోటీసులను ఆయన కోర్టులో సవాల్ చేయగా.. డిసెంబర్5వ తేదీ వరకు హైకోర్టు ఆయనకు సిట్ నోటీసులపై స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.
గుజరాత్ పర్యటనలో భాగంగా బి.ఎల్.సంతోష్ బార్డోలీలో కార్యకర్తలతో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బార్డోలీలో సర్దార్ వల్లబాయ్ పటేల్ నేషనల్ మ్యూజియాన్ని సందర్శించారు.
బార్డోలీలో సర్దార్ వల్లబాయ్ పటేల్ నేషనల్ మ్యూజియాన్ని సందర్శించి.. మహానీయుడు పటేల్‌కు నివాళులర్పించడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్.సంతోష్ పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ నాయకులు మాత్రం తమ పార్టీ నాయకులకు ఈ ఘటనతో సంబంధం లేదని చెబుతూ వస్తున్నారు.
గుజరాత్‌లోని బర్దోలీలో సర్దార్ వల్లాబాయ్ పటేల్ 1920 నుండి దాదాపు ఒక దశాబ్దం పాటు నివసించారు. బర్దోలీ సత్యాగ్రహాన్ని ప్రారంభించేందుకు రైతులు, సామాన్య ప్రజలను సంఘటితం చేశారు. దీంతో బర్దోలీలో సర్దార్ వల్లాబాయ్ పటేల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.
గుజరాత్‌లోని బార్డోలి, మహువ , వ్యారా అసెంబ్లీ నియోజకవర్గాల సంస్థాగత సమావేశాల్లో బిఎల్.సంతోష్ పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికల్లో విజయం కోసం సంస్థాగతంగా ఎలా వ్యవహరించాలనేదానిపై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.