- Telugu News Photo Gallery Late dinner timing mistake can causes these health problems Telugu Health News
Dinner: రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా.. అయితే ఈ అనారోగ్యాలు వస్తాయి జాగ్రత్త..!
ఈ రోజుల్లో ఆహారాన్ని తీసుకునే విధానంలో మార్పు అనేది ఒక రకమైన ఫ్యాషన్‌గా మారింది. ఈ అలవాటు శరీరంలో ఎలాంటి సమస్యలను కలిగిస్తుందో తెలిస్తే..ఇకపై రాత్రి భోజనం అస్సలు ఆలస్యం చేయరు..
Updated on: Nov 26, 2022 | 9:27 PM

రాత్రి 8 గంటల్లోపే డిన్నర్ చేసేయ్యాలి. వైద్యులు, ఆహార నిపుణులు ఇదే చెబుతున్నారు. కానీ, ప్రజలు రాత్రిపూట ఆహారం తీసుకునే విధానంలో అనేక మార్పులు వచ్చాయి. అది కూడా ఒక రకమైన ఫ్యాషన్‌గా మారింది. ఈ మార్పు అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది.

నిజానికి, డిన్నర్ టైమింగ్‌ని ట్యాంపరింగ్ చేయడం పొరపాటు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి 8 గంటల లోపు ఆహారం తీసుకోవాలి. నిద్ర, ఆహారం మధ్య 2 గంటల గ్యాప్ ఉండాలి. ఇలా చేస్తేనే జీవక్రియ బాగా పనిచేస్తుంది.

రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం చెడ్డ విషయం కాదు. కానీ అది అలవాటుగా మారితే సమస్యలు పెరుగుతాయి. ఈ స్థితిలో ఆహారం జీర్ణం కాదు. బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇది కాకుండా, ఆలస్యంగా ఆహారం తినడం వల్ల నిద్రలేమి సమస్య ఏర్పాడుతుంది. ఆలస్యంగా రాత్రి భోజనం చేసే అలవాటు వల్ల దినచర్య దెబ్బతింటుంది. ఈ పద్దతి హై బీపీ, చెడు కొలెస్ట్రాల్, డయాబెటిస్ బారినపడేలా చేస్తుంది.

రాత్రి భోజనం ఆలస్యంగా చేసేవారిలో కడుపు సంబంధిత సమస్యలు ఉబ్బరం, ఛాతీలో మంట, అసిడిటీ కూడా కొనసాగుతాయి. ఆహారం జీర్ణం కావడానికి ఎంత ఎక్కువ సమయం ఇస్తే శరీరానికి అంత మంచిది.




