AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Symptoms: ఈ 6 లక్షణాలు పిల్లల్లో మధుమేహానికి సంకేతాలు.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్యాక్డ్ ఫుడ్, వైట్ రైస్, శీతల పానీయాల వినియోగానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఆకుపచ్చ కూరగాయలు, గింజలు, అవిసె గింజలు మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి.

Diabetes Symptoms: ఈ 6 లక్షణాలు పిల్లల్లో మధుమేహానికి సంకేతాలు.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి
Diabetes In Kids
Jyothi Gadda
|

Updated on: Nov 26, 2022 | 3:25 PM

Share

పిల్లల్లో మధుమేహం లక్షణాలు: మధుమేహం అనేది ఒక సమస్య. దీని కారణంగా ప్రపంచంలోని చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం పిల్లల్లో కూడా మధుమేహం ఎక్కువగా కనిపిస్తోంది. మీ కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే పిల్లలకు కూడా మధుమేహం వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ మధుమేహం అంటే ఏమిటి..? అన్న విషయానికి వస్తే.. మధుమేహం అనేది రక్తంలో చక్కెర స్థాయి పెరగడం..సాధారణంగా ఈ సమస్య శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ లేకపోవడం వల్ల వస్తుంది. రక్తంలో చక్కెరను నిర్వహించడానికి ఇన్సులిన్ పనిచేస్తుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు, తగ్గినప్పుడు, అప్పుడు డయాబెటిక్‌ సమస్య తలెత్తుతుంది.

పిల్లల్లో మధుమేహం లక్షణాలు: – మధుమేహం వల్ల పిల్లలకు దాహం చాలా రెట్లు పెరుగుతుందని గమనించబడింది.

– మీ బిడ్డకు కొన్నిసార్లు కంటిచూపు సమస్య ఉంటే అది మధుమేహం లక్షణం కావచ్చు.

ఇవి కూడా చదవండి

– తరచుగా మూత్రవిసర్జన చేయడం కూడా మధుమేహం లక్షణం.

– మధుమేహం సమస్య ఉన్న పిల్లలు చాలా ఆకలితో ఉంటారు. అదే సమయంలో వారు బలహీనంగా కనిపిస్తుంటారు.

– పిల్లలలో తరచుగా చర్మ సమస్యలు కూడా మధుమేహాన్ని సూచిస్తాయి.

– వేగంగా బరువు తగ్గడం కూడా మధుమేహం లక్షణం కావచ్చు.

మీ పిల్లలో గనుక ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. ఇంటి నివారణలు కూడా హానికరమని గుర్తుపెట్టుకోవాలి. మధుమేహం ప్రారంభ దశలోనే గుర్తించినట్టయితే, దానిని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు.

ఇకపోతే, మధుమేహం రెండు రకాలు. 1- మధుమేహం టైప్-1, 2- మధుమేహం టైప్-2

మీకు డయాబెటిస్ ఉన్నప్పుడు ఏం తినాలో తెలుసా..? మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్యాక్డ్ ఫుడ్, వైట్ రైస్, శీతల పానీయాల వినియోగానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఆకుపచ్చ కూరగాయలు, గింజలు, అవిసె గింజలు మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి