AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాస్ రావు ఫోటో.. దిగ్గజ నటుడికి అరుదైన గౌరవం

యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం. ఎట్టకేలకు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఘనంగా జరుగుతుంది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు ప్రముఖ హాలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రీయన్ వ్యాఖ్యతగా వ్యవహరించారు.

ఆస్కార్ వేదికపై  కోట శ్రీనివాస్ రావు ఫోటో.. దిగ్గజ నటుడికి అరుదైన గౌరవం
Kota Srinivasa Rao
Rajeev Rayala
|

Updated on: Mar 16, 2026 | 6:54 PM

Share

ఆస్కార్ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో హాలీవుడ్ తారలు తళుక్కుమన్నారు. ఈ ఏడాది వేడుకల్లో రాజకీయ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు, చారిత్రాత్మక విజయాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కాగా ఆస్కార్ వేడుకల్లో తెలుగు దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు ఫోటో ఆకట్టుకుంది. ఆస్కార్ వేదికగా నటుడు కోట శ్రీనివాసరావును స్మరించుకున్నారు. గతేడాది ఈ లోకాన్ని విడిచివెళ్లిన తెలుగు విలక్షణ నటుడిని అకాడమీ గుర్తుచేసుకుంటూ నివాళి జాబితాలో చేర్చింది. కోటశ్రీనివాసరావుతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి లాంటి నటులకు గుర్తు చేసుకున్నారు. ఈమేరకు నివాళులు అర్పిస్తూ ఓ వీడియోను స్టేజ్ పై ప్లే చేశారు.

దిగ్గజ నటుడు కోట శ్రీనివాస్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసి మెప్పించారు. గత ఏడాది జులైలో అనారోగ్య సమస్యలతో కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. 1978లో చిరంజీవి సినిమా ప్రాణం ఖరీదు తోనే ఆయన కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కమెడియన్ గా , విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 850 సినిమాల్లో నటించారు.

కళామతల్లికి కోట అందించిన సేవలకు ప్రతీకగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయనను గౌరవించింది. అలాగే ఆయన నటనా ప్రతిభకు ప్రతీకగా తొమ్మిది నంది అవార్డులు దక్కాయి. కేవలం నటుడిగానే కాకుండా రాజకీయ వేత్తగానూ కోట సత్తా చాటారు. 1978 లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన సుమారు 37 ఏళ్ల పాటు సినిమాల్లో నటించారు. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్స్ సినిమాల్లో భాగమయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us