AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Overhydration: మరీ ఎక్కువగా నీళ్లు తాగుతున్నారా..? ప్రాణాలు పోతాయట జాగ్రత్త..! నిపుణుల హెచ్చరిక..

బ్రూస్ లీని ప్రపంచంలోనే గొప్ప మార్షల్ ఆర్టిస్ట్‌గా పేర్కొంటారు. చైనాకు చెందిన హ్యూమన్‌ డ్రాగన్‌ బ్రూస్‌ లీ.. చాలా చిన్నవయస్సులోనే ఈ లోకాన్ని వీడాడు.. మూడు పదుల వయస్సులోనే పలు సమస్యలతో కన్నుమూశాడు. అయితే, బ్రూస్ లీ మృతికి సంబంధించి తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Overhydration: మరీ ఎక్కువగా నీళ్లు తాగుతున్నారా..? ప్రాణాలు పోతాయట జాగ్రత్త..! నిపుణుల హెచ్చరిక..
Water
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 26, 2022 | 1:58 PM

Overhydration: బ్రూస్ లీని ప్రపంచంలోనే గొప్ప మార్షల్ ఆర్టిస్ట్‌గా పేర్కొంటారు. చైనాకు చెందిన హ్యూమన్‌ డ్రాగన్‌ బ్రూస్‌ లీ.. చాలా చిన్నవయస్సులోనే ఈ లోకాన్ని వీడాడు.. మూడు పదుల వయస్సులోనే పలు సమస్యలతో కన్నుమూశాడు. అయితే, బ్రూస్ లీ మృతికి సంబంధించి తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్రూస్‌లీ నీరు ఎక్కువగా తాగడం వల్లే మరణించాడని పరిశోధనలో వెల్లడైంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల మెదడు వాచిపోయి కిడ్నీలు కూడా నీటితో నిండిపోయాయని పరిశోధనలో వెల్లడైంది. దీంతో ఆకస్మికంగా మృతి చెందాడని.. దీనికి ఎడెమా హైపోనాట్రేమియా కారణమని పరిశోధకులు తెలిపారు. అయితే, 1973లో బ్రూస్ లీ మరణం సమయంలో శవపరీక్ష నివేదిక ప్రకారం.. లీ సెరిబ్రల్ ఎడెమాతో చనిపోయాడని తేలింది. పెయిన్ కిల్లర్ తీసుకున్న తర్వాత మెదడు వాపు వచ్చిందని డాక్టర్స్ చెప్పారు. కొత్త అధ్యయనం ప్రకారం ఇప్పుడు ఎడెమా హైపోనాట్రేమియా ద్వారా సంభవించిందని పరిశోధకులు తెలిపారు.

పరిశోధన ఏం వెల్లడించింది?

బ్రూస్ లీ ఆహారం తీసుకోలేదని, ఫిట్‌గా ఉండేందుకు లిక్విడ్‌లు మాత్రమే తీసుకున్నారని పరిశోధనలో తేలింది. ఇలాంటి సమయంలో ఈ రోజు మనం ఓవర్‌హైడ్రేషన్ గురించి మీకు చెప్పనున్నాం.. ఇది నిజంగా ఎవరైనా చనిపోయేలా చేయగలదా? ‘క్లినికల్ కిడ్నీ జర్నల్’ డిసెంబర్ ఎడిషన్ దీనికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. స్పెయిన్‌కు చెందిన కిడ్నీ నిపుణులు దీనిలో పలు షాకింగ్ విషయాలను ప్రచురించబడింది. బ్రూస్ లీ కిడ్నీలు నీళ్లతో నిండిపోయాయని, అది సకాలంలో నిర్వహణ జరగలేదని ఈ జర్నల్ పేర్కొంది.

ఎక్కువ నీరు తాగడం ప్రమాదకరమా?

బ్రూస్ లీ మరణం గురించి బయటకు వచ్చిన వాస్తవాలు.. ఎక్కువ నీరు తాగటం మన శరీరానికి ప్రమాదకరమా ? అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. ఎక్కువ నీరు తాగడం కూడా మరణానికి కారణమవుతుంది. ఇది ఇంట్రాక్రానియల్ ఒత్తిడిని పెంచుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తి వారి మూత్రపిండాలు నిర్వహించగలిగే దానికంటే ఎక్కువ నీరు తాగినప్పుడు ఓవర్‌హైడ్రేషన్, నీటి మత్తు ఏర్పడుతుంది. ఈ నీరు మన శరీరంలోని భాగాల్లో, అవయవాల్లో చాలా ఎక్కువ అవుతుంది. అది టాయిలెట్ ద్వారా కూడా బయటకు వెళ్లదు.

ఇవి కూడా చదవండి

ప్రతిరోజూ ఎంత నీరు తాగాలి

ముందుగా మీ బరువును నిర్ధారించుకోండి.. బరువును తూకిన తర్వాత దానిని 30 ద్వారా విభజించండి. వచ్చే సంఖ్య తాగునీటి గణనగా నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘ఉదాహరణకు, మీ బరువు 60 కిలోలు ఉంటే.. 60ని 30తో భాగిస్తే 2 వస్తుంది. అంటే ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 2 లీటర్ల నీరు తాగాలి.. అని అర్ధం’’.. మీ శరీరానికి అనుగుణంగా నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ లేదా తక్కువ నీరు మన శరీరానికి కూడా ప్రమాదకరమని, కావున దీనిపై అవగాహనతో ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..