AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cashew Nuts: జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా? నిపుణులు ఏమంటున్నారంటే?

జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, బరువు పెరిగే అవకాశముందని కొందరు భయపడుతుంటారు. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదంటున్నారు నిపుణులు.

Cashew Nuts: జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా? నిపుణులు ఏమంటున్నారంటే?
Cashew
Basha Shek
|

Updated on: Nov 26, 2022 | 1:26 PM

Share

డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు పలు అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. అలాంటి ఆరోగ్య పోషకాలున్న డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు కూడా ఒకటి. జీడిపప్పులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, రాగి, మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, థయామిన్, విటమిన్ బి6, విటమిన్ కె, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. అందుకే జీడిపప్పును పోషకాల నిధి అని పిలుస్తారు.దీనిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు సూచిస్తారు. పైగా ఇవి ఎంతో రుచికరంగా కూడా ఉంటాయి. అందుకే ఎంతోమంది వీటిని ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అదే సమయంలో జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, బరువు పెరిగే అవకాశముందని కొందరు భయపడుతుంటారు. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదంటున్నారు నిపుణులు.

గుండెకు ఎంతో మేలు..

జీడిపప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే కాళ్ల నొప్పులు దూరమవుతాయి. కొలెస్ట్రాల్ లేని కారణంగా ఇది గుండె ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారంగా పరిగణిస్తారు. ఇక ఈ డ్రై ఫ్రూట్ చర్మానికి మేలు చేస్తుంది. ముడతలను తగ్గించి వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది, అందుకే విద్యార్థులు వీటిని ఎక్కువగా తినాలంటారు. హైపర్‌టెన్సివ్ రోగులకు జీడిపప్పు మంచి ఆహారం. జీడిపప్పు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఇది శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు ఎముకలను కూడా దృఢపరుస్తుంది. జీడిపప్పులో ఉండే కాపర్, ఐరన్ ఎర్ర రక్త కణాల ఏర్పాటులో సహాయపడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్