Telugu News » Photo gallery » Are you drinking Tea, Know How to Check Your Tea For Adulteration FSSAI shares details
Tea: మీరు తాగే కప్పు టీ మంచిదేనా..? అసలైన తేయాకును ఎలా గుర్తించవచ్చు.. స్మార్ట్ ట్రిక్స్ మీకోసం..
Shaik Madarsaheb |
Updated on: Nov 26, 2022 | 1:11 PM
ఒక కప్పు టీతో రోజు ప్రారంభమవుంది. ఉదయం నిద్ర నుంచి లేవగానే.. చాలామంది టీ తాగుతారు. ఇంకా అలసట వచ్చినా.. లేదా తలనొప్పిగా ఉన్నా టీ తాగి ఉపశమనం పొందుతారు. అందుకే టీ లేకుండా కొందరు జీవితాన్ని అస్సలు ఊహించలేదు..
Nov 26, 2022 | 1:11 PM
ఒక కప్పు టీతో రోజు ప్రారంభమవుంది. ఉదయం నిద్ర నుంచి లేవగానే.. చాలామంది టీ తాగుతారు. ఇంకా అలసట వచ్చినా.. లేదా తలనొప్పిగా ఉన్నా టీ తాగి ఉపశమనం పొందుతారు. అందుకే టీ లేకుండా కొందరు జీవితాన్ని అస్సలు ఊహించలేదు.. అయితే మీరు తాగుతున్న టీ కల్తీనా..? కాదా? అనే విషయాన్ని ఎప్పుడైనా తెలుసుకున్నారు. టీ ఆకుల (టీ పొడి) ద్వారా దీనిని తెలుసుకోవచ్చు.
1 / 7
ఆధునిక కాలంలో మార్కెట్ నకిలీ వస్తువులతో నిండిపోయింది. కల్తీ టీలో రుచి తోపాటు నాణ్యత కూడా ఉండదు. అదనంగా, కల్తీ టీలో రసాయన రంగులు ఉంటాయి.. ఇవి కాలేయాన్ని దెబ్బతీస్తాయి.
2 / 7
అందుకే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సోషల్ మీడియాలో ప్రామాణికమైన టీని గుర్తించే మార్గాలను షేర్ చేసింది. అసలు టీ (టీపొడి) ని ఎలా గుర్తించాలో చూద్దాం.
3 / 7
టీ ఆకులు స్వచ్ఛంగా, కల్తీ లేకుండా ఉన్నాయో లేదో తనిఖీ చేయడానికి ఫిల్టర్ పేపర్‌ని ఉపయోగించండి. ఫిల్టర్ పేపర్ తీసుకోండి. దానిపై టీ ఆకులను వేయండి. దానిపై కొంచెం నీరు పోయాలి.
4 / 7
ఇప్పుడు ఆ ఫిల్టర్ పేపర్‌ను నీటితో బాగా కడగాలి. అనంతరం ఆ తడి ఫిల్టర్ పేపర్‌ను లైట్ ముందు పట్టుకోండి. కాగితంపై టీ మరకలను తనిఖీ చేయండి.
5 / 7
టీ కల్తీ అయితే కాగితంపై నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కానీ టీ స్వచ్ఛంగా ఉంటే అది ఫ్లిటర్ పేపర్‌పై మరక పడదు. అప్పుడే మీ టీ కల్తీమా, స్వచ్ఛమైనదా అనేది తెలుస్తుంది.
6 / 7
ఈ విధంగా టీ పొడి మంచిదో కల్తీదో తెలుసుకోవచ్చని ఫుడ్ సేఫ్టీ నిపుణులు పేర్కొంటున్నారు.