- Telugu News Photo Gallery Spiritual photos Gujarat palitana city is indias only vegetarian town total details here
Vegetarian City in India: ఈ నగరం మనదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఏకైక శాఖాహార నగరం.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..
గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో 55 కి.మీ దూరంలో ఉన్న నగరం పాలిటానా. ఈ నగరం చాలా అందంగా ఉంటుంది. జైన మతస్థులకు చెందిన ఒక పవిత్ర పుణ్యక్షేత్రం.
Updated on: Nov 26, 2022 | 4:12 PM

ప్రపంచవ్యాప్తంగానే కాదు.. మన దేశంలో కూడా అనేక ప్రత్యేక ప్రదేశాలున్నాయి. కొన్ని ప్రదేశాలు ఆలయాలు నిలయం అయితే.. మరికొన్ని అందమైన ప్రకృతికి ఆలయాలు. అనేక రహస్యాలు వింతలను దాచుకున్న ప్రదేశాలతో పాటు ఈ నగరం వెరీ వెరీ స్పెషల్. ఈ నగరం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇది పూర్తిగా శాఖాహార నగరం.. ప్రపంచంలోనే మొదటి నగరంగా ఖ్యాతిగాంచింది పాలిటానా.

పాలిటానా నగరం గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో 55 కి.మీ దూరంలో ఉన్న నగరం. నగరం చాలా అందంగా ఉంది. జైన మతస్థులకు చెందిన ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ఇక్కడ జంతువులను చంపడం చట్టప్రకారం శిక్షార్హంగా పరిగణిస్తారు.

జైన మతస్థులకు పాలిటానా నగరం చాలా ముఖ్యమైనది. 900 కంటే ఎక్కువ దేవాలయాలున్న ఏకైక పర్వతం. ఈ పర్వతం పేరు శత్రుంజయ. ఈ శత్రుంజయ పర్వతాలు జైనుల పంచక్షేత్రాలలో ఒకటి. ఇక్కడికి చేరుకోవాలంటే భక్తులు దాదాపు 3950 మెట్లు ఎక్కాలి.

మీరు పాలిటానా నగరాన్ని సందర్శించాలనుకున్నట్లు అయితే.. ఇక్కడ పర్యాటకులను ఆకట్టుకునే అనేక ప్రదేశాలు ఉన్నాయి. శత్రుంజయ కొండ, శ్రీ విశాల్ జైన్ మ్యూజియం, హస్తగిరి జైన తీర్థం, గోపనాథ్ బీచ్ మొదలైన వాటిని చూడవచ్చు.

రైలులో వెళుతున్నట్లయితే.. భావ్‌నగర్ లేదా అహ్మదాబాద్‌కు రైలు మార్గంలో చేరుకోవాలి. పాలిటానా.. భావ్‌నగర్ నుండి 55 కి.మీ దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ నుంచి టాక్సీ వంటి రవాణసాధనలతో పాలిటానాకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బస్సులో వెళుతున్నట్లయితే.. సూరత్, అహ్మదాబాద్, భావ్‌నగర్ మొదలైన వాటికి బస్సులో వెళ్లవచ్చు. విమానంలో వెళ్లే పర్యాటకులు సమీపంలోని భావ్‌నగర్ విమానాశ్రయంలో చేరుకోవాలి.




