- Telugu News Photo Gallery Health tips: eat these 6 types of foods that high in zinc to boost immunity in telugu
Zinc Food: శీతాకాలంలో వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటున్నారా..? ఈ జింక్ ఫుడ్ తీసుకోండి చాలు..
శరీరంలో తగినన్ని పోషకాలు, విటమిన్లు లేకపోతే ఎన్నో సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఇలాంటి సమయంలో పలు జబ్బుల బారిన పడే అవకాశం పెరుగుతుంది. అలాంటి పోషకాల్లో జింక్ కూడా ఒకటి.. శరీరంలో జింక్ లోపిస్తే.. పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Updated on: Nov 23, 2022 | 1:40 PM

శరీరంలో తగినన్ని పోషకాలు, విటమిన్లు లేకపోతే ఎన్నో సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఇలాంటి సమయంలో పలు జబ్బుల బారిన పడే అవకాశం పెరుగుతుంది. అలాంటి పోషకాల్లో జింక్ కూడా ఒకటి.. శరీరంలో జింక్ లోపిస్తే.. పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పోషకం చాలా అవసరమని పేర్కొంటున్నారు. కానీ జింక్ మాత్రల మీద ఎప్పుడూ ఆధారపడకూడదని హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఆహారం ద్వారా శరీరంలో జింక్ అవసరాన్ని తీర్చుకోవచ్చు. ఈ జింక్ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందుతాయి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ పరిమిత పరిమాణంలో రెడ్ మీట్ తినడం వల్ల శరీరంలో జింక్, ఐరన్ లోపాన్ని భర్తీ చేయవచ్చు. గొర్రె, మేక వంటి మాంసాలలో జింక్ అధికంగా ఉంటుంది. అందుకే వీటిని తినడం మంచిదని పేర్కొంటున్నారు.

జింక్ పప్పు ధాన్యాలలో కూడా పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని పోషకాల లోపాన్ని తీర్చడానికి, ప్రతిరోజూ ఒక రకం పప్పు దినుసులను తినాలని సూచిస్తున్నారు. పెసర పప్పు, రాజ్మా, కంది, మినప పప్పు ఇలా ఏ పప్పు అయినా.. శరీరానికి అవసరమైన జింక్ ను తీర్చగలదు.

కూరగాయలలో జింక్ కూడా ఉంటుంది. అంతేకాకుండా, శరీరంలో పోషకాహార లోపాన్ని తీర్చడానికి కూరగాయలను తినడం చాలా ముఖ్యం. బంగాళదుంప, పుట్టగొడుగులు, బీన్స్, బచ్చలికూర, క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలను శీతాకాలంలో తినవచ్చు. ఇవి శరీరంలో జింక్ లోపాన్ని భర్తీ చేయడంతోపాటు శక్తిని అందిస్తాయి.

అవిసె గింజలు, చియా గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు-ఇలాంటి ఆహారాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ రకమైన విత్తనాలలో ఫైబర్ చాలా ఉంటుంది. అవి జింక్ కు గొప్ప మూలంగా కూడా పేర్కొంటారు.

మీ రోజువారీ ఆహారంలో పెరుగు, పాలు వంటి ఆహారాలను తీసుకోండి. అల్పాహారంగా పెరుగును కూడా తీసుకోవచ్చు. అలాగే ఉడికించిన గుడ్లు తినండి. పాల ఉత్పత్తులు, గుడ్లలో మంచి మొత్తంలో జింక్ ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఆహారాలు ప్రోటీన్ అవసరాన్ని కూడా తీరుస్తాయి.




