Fixed Deposit: మీరు ఈ బ్యాంకుల వినియోగదారులా? ఎందులో అత్యధిక వడ్డీ రేటు

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేవారికి వివిధ బ్యాంకులు మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ ఏడాది మే నెల తర్వాత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెపో రేటును అనేక సార్లు పెంచింది. ఆ తర్వాత ప్రభుత్వ రంగ..

Subhash Goud

|

Updated on: Nov 23, 2022 | 1:44 PM

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేవారికి వివిధ బ్యాంకులు మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ ఏడాది మే నెల తర్వాత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెపో రేటును అనేక సార్లు పెంచింది. ఆ తర్వాత ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు రుణ వడ్డీని అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచాయి. దీని కారణంగా ఇప్పుడు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి.

1 / 6
అదే సమయంలో అనేక బ్యాంకులు ప్రత్యేక ఎఫ్‌డీ ప్రణాళికలను కూడా ప్రారంభించాయి. ఇందులో సాధారణ పౌరులు 7 శాతం కంటే ఎక్కువ వడ్డీని పొందుతున్నారు. సీనియర్ సిటిజన్లు 9 శాతం వరకు వడ్డీని పొందుతున్నారు.

2 / 6
మీరు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే ప్రధాన బ్యాంకులు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ వివిధ రకాలుగా ఉంది.

3 / 6
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేటు: ప్రైవేట్ రంగంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సాధారణ పౌరులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 నుండి 6 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం నుండి 7 శాతం వడ్డీని అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ వడ్డీ రేటును 7 రోజుల నుండి 10 సంవత్సరాల పెట్టుబడిపై అందిస్తోంది. ఈ రేట్లు నవంబర్ 8, 2022 నుండి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఎఫ్‌డిలపై రూ. 5 కోట్ల కంటే తక్కువ పెట్టుబడికి ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ప్రత్యేక ఎఫ్‌డిలపై 0.25 శాతం ఎక్కువ వడ్డీని అందిస్తోంది.

4 / 6
Fixed Deposit: మీరు ఈ బ్యాంకుల వినియోగదారులా? ఎందులో అత్యధిక వడ్డీ రేటు

5 / 6
ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేటు: నవంబర్ 16న బ్యాంక్ తన ఎఫ్‌డీ వడ్డీ రేటును పెంచింది. బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ పెట్టుబడిపై 30 బిపిఎస్‌లను పెంచింది. ఇప్పుడు 7 రోజుల నుండి 10 సంవత్సరాల పెట్టుబడిపై సాధారణ పౌరులకు 3% నుండి 6.60% వరకు, సీనియర్ సిటిజన్లకు 3.50% నుండి 7% వరకు ఉంటుంది.

6 / 6
Follow us