AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Heart: చలికాలంలో గుండె జబ్బులతో పెను ముప్పు.. ఈ జాగ్రత్తలతో రక్షణ పొందవచ్చు

చలికాలంలో లైఫ్‌స్టైల్‌ పరంగా చాలా మార్పులు చేసుకోవాలి. అలాగే అందం, ఆరోగ్యం పరంగా మరింత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో గుండె సంబంధిత సమసల్యున్న వారు అప్రమత్తంగా ఉండాలి.

Basha Shek
|

Updated on: Nov 23, 2022 | 12:37 PM

Share
చలికాలంలో లైఫ్‌స్టైల్‌ పరంగా చాలా మార్పులు చేసుకోవాలి. అలాగే అందం, ఆరోగ్యం పరంగా మరింత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో గుండె సంబంధిత సమసల్యున్న వారు అప్రమత్తంగా ఉండాలి.

చలికాలంలో లైఫ్‌స్టైల్‌ పరంగా చాలా మార్పులు చేసుకోవాలి. అలాగే అందం, ఆరోగ్యం పరంగా మరింత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో గుండె సంబంధిత సమసల్యున్న వారు అప్రమత్తంగా ఉండాలి.

1 / 6
చలికాలంలో ఆరోగ్యకరమైన, పోషకాహారం బాగా తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయాలి. యోగానూ కూడా లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకోవాలి.

2 / 6
అధిక కొవ్వు ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. ఇది గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ఆహారంపై ఓ కన్నేసి ఉంచాలి. ఎక్కువ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. అలాగే కూరగాయలను ఎక్కువగా తినాలి

3 / 6
వాతావరణంలోని మార్పులు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇది కూడా గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ఒత్తిడి, ఆందోళనలకు వీలైనంత దూరంగా ఉండాలి.

4 / 6
చలికాలంలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అతి చల్లని లేదా అతి వేడి నీళ్లలో స్నానం చేయవద్దు. రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ఇది గుండెకు హాని కలిగించవచ్చు. అలాగే తలస్నానం చేసేటప్పుడు ముందుగా నీళ్లు పోసుకోకూడదు. ముందుగా కాళ్లపై, తర్వాత శరీరంపై, చివరగా తలపై నీరు పోసుకోవాలి. ఇది బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించవచ్చు.

5 / 6
చలికాలంలో ఫాస్ట్ ఫుడ్, స్పైసీ ఫుడ్‌ తినడం తగ్గించుకోవాలి. ఎక్కువ చక్కెర, ఉప్పు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇటువంటి ఆహారాలు రక్తపోటును పెంచే అవకాశం ఉంది. శీతాకాలంలో మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.

6 / 6