Maruti Suzuki: త్వరలో మార్కెట్‌లోకి రానున్న రెండు హై మైలేజీ కార్లు.. వాటి ధర, ఇతర వివరాలు
దేశంలో కార్ల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎస్‌యూవీ కార్లపై మోజు రోజు రోజుకు పెరుగుతోంది. కానీ, దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మాత్రం..
Updated on: Nov 23, 2022 | 11:03 AM

ఎంట్రీ లెవల్ కార్లలో మారుతి వాటా 90 శాతం పైనే. అందుకే ఎంట్రీ లెవల్ కార్లతోపాటు కంపాక్ట్ సెడాన్ కార్ల ఆవిష్కరణపైనే కేంద్రీకరించింది.

ఈ ఏడాది న్యూ జనరేషన్ సెలేరియో, ఆల్టో కే10 మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన మారుతి సుజుకి.. 2024లో హ్యాచ్‌బ్యాక్, కంపాక్ట్ సెడాన్‌లను ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతుంది.

న్యూ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్, డిజైర్ కంపాక్ట్ సెడాన్ కార్లను తీసుకువస్తోంది. మైలేజీతోపాటు హైబ్రీడ్ టెక్నాలజీ కార్లతో మార్కెట్ వాటాను కొల్లగొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

ఏడాది తర్వాత మార్కెట్‌లోకి వచ్చే స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ , డిజైర్ కంపాక్ట్ సెడాన్ కార్లు 1.2 లీటర్లతోపాటు 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో డిజైన్ చేస్తుంది.

న్యూ స్విఫ్ట్, న్యూ డిజైర్ కార్లు లీటర్‌కు 35-40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయని ఇస్తోంది. ఇలా మైలేజీ ఇస్తే ఈ రెండు మోడల్ కార్లు అత్యంత ఫ్యూయల్ ఎఫిషియెంట్ వెహికల్స్‌గా నిలుస్తాయి.





























