- Telugu News Photo Gallery Dental Care: winter toothache 5 foods to avoid to take care your sensitive teeth
Dental Care: దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. శీతాకాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..
శీతాకాలంలో ఎన్నో సమస్యలు చుట్టుముడుతుంటాయి. జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ లాంటివి సంక్రమిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో చాలా మంది పంటి నొప్పితో బాధపడుతుంటారు. చల్లని వాతావరణంలో పంటి నొప్పి భరించడం కష్టం.
Updated on: Nov 24, 2022 | 1:58 PM

శీతాకాలంలో ఎన్నో సమస్యలు చుట్టుముడుతుంటాయి. జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ లాంటివి సంక్రమిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో చాలా మంది పంటి నొప్పితో బాధపడుతుంటారు. చల్లని వాతావరణంలో పంటి నొప్పి భరించడం కష్టం. దంత సమస్యల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ శీతాకాలంలో ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.

తీపి ఆహారాలు దంతాలకు ఎప్పుడూ మంచివి కావు.. ఇది దంతాల ఎనామిల్‌ను దెబ్బతిస్తుంది. చక్కెర పదార్ధాల నుంచి ఉత్పత్తి అయ్యే యాసిడ్ దంతాలు, చిగుళ్ళకు హానికరం. కాబట్టి చలికాలంలో స్వీట్లకు, తీపి ఆహారాలకు దూరంగా ఉండండి.

శీతల పానీయాలు దంతాలకు అస్సలు మంచివి కావు. సోడా ఉన్న శీతల పానీయాలలో కూడా చక్కెర ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే యాసిడ్ దంత క్షయాన్ని పెంచుతుంది. సోడా ఉన్న శీతల పానీయాలు ఆరోగ్యానికి ఎప్పుడూ మంచివి కావని, దూరంగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.

చాక్లెట్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కానీ దంతాల విషయానికి వస్తే, ఈ పదార్థాలు అస్సలు మంచివికావు. చక్కెర లేదా ఇతర తీపి పదార్థాలను ఉపయోగించి తయారు చేసే అనేక చాక్లెట్లు ఉన్నాయి. ఇది పంటి నొప్పికి కారణం కావచ్చు.

డ్రై ఫ్రూట్స్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ ఎండుద్రాక్ష, ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్ దంత సమస్యలను పెంచుతాయి. వాస్తవానికి, ఇవి రుచిలో తియ్యగా ఉంటాయి. వాటిలోని స్వభావం దంతాలను దెబ్బతీస్తుంది.

దంత సమస్యలు ఉన్నప్పుడు చిప్స్ అస్సలు తినకూడదని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పొటాటో చిప్స్ దంత సమస్యలను పెంచుతాయి. చలికాలంలో పంటి నొప్పికి కారణమయ్యే స్టార్చ్ ఇందులో ఉంటుంది. కావున అలాంటి చిరుతిళ్లకు దూరంగా ఉండండి.




