AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇల్లు సువాసన భరితంగా ఉండాలంటే ఇలా చేసి చూడండి.. మరింత సంతోషంగా ఉంటారు..

మీరు మీ పొరుగువారి ఇంటికి లేదంటే స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు వెంటనే గమనించే విషయం వాసన. ఇల్లు మంచి వాసన ఉంటే మీరు అక్కడ మరింత సుఖంగా ఉంటారు. కాబట్టి,..

మీ ఇల్లు సువాసన భరితంగా ఉండాలంటే ఇలా చేసి చూడండి.. మరింత సంతోషంగా ఉంటారు..
Cleanliness
Jyothi Gadda
|

Updated on: Nov 28, 2022 | 7:43 AM

Share

ఇల్లు మంచి వాసన వెదజల్లుతూ ఉంటే మీరు మరింత సుఖంగా ఉంటారు. ఇంటి విషయంలో ఎంత అందంగా పెట్టుకొంటే అన్ని ప్రశంసలు పొందుతారు. అయితే, మన ఇంట్లో ఎంత కొత్తగా చేసినా, ఎన్ని అలంకరణ వస్తువులతో ఎంత అందంగా అలంకరించినా ఇంట్లో సుచి, శుభ్రత చాలా ముఖ్యం. ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నా, చూడటానికి శుభ్రంగా కనబడ్డా, కొందరి ఇళ్లలోదుర్గంద వాసన వస్తుంటుంది. ఇంటి అలంకరణతో పాటు, ఇంట్లో మంచి సువాసన వెలువడితే ఆ ఇంటికి మరింత ఆకర్షణ కలుగుతుంది. గార్డెన్లో మొక్కలన్నీంటిని చక్కగా ఒక ప్రక్కగా అమర్చిఉంటాము. దానికితోడు గార్డెన్ లోని సెంట్ జాజులు, గుండు మల్లె, లేదా గులాబీలు గుభాళిస్తుంటే ఆ గార్డెన్ కు ఎంత ఆకర్షణగా ఉంటుందో చెప్పలేం కదా.. మీరు మీ పొరుగువారి ఇంటికి లేదంటే స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు వెంటనే గమనించే విషయం వాసన. ఇల్లు మంచి వాసన ఉంటే మీరు అక్కడ మరింత సుఖంగా ఉంటారు. కాబట్టి మీ ఇంటిని ఎల్లవేళలా మంచి వాసనతో ఉంచడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

1. బేకింగ్ సోడా: మీరు కొన్ని రకాల సెంట్లు, ఫరఫ్యూమ్‌లు ఉపయోగించవచ్చు. కొన్నిసార్లు ఇవి దుర్వాసనతో కలిపి విపరీత వాసనను కలిగిస్తాయి. కానీ బేకింగ్ సోడా చెడు వాసనను గ్రహిస్తుంది. ఉదాహరణకు, మీ రిఫ్రిజిరేటర్‌లో బేకింగ్ సోడా కంటైనర్‌ను ఉంచడం వల్ల ఇతర ఆహార పదార్థాల దుర్వాసన తొలగిపోతుంది. కాబట్టి చెడు వాసనను త్వరగా పోగొట్టుకోవడానికి ఇంట్లో ప్రతి మూలలో బేకింగ్ సోడా ఉంచటం మంచిది. బేకింగ్ సోడాను విండో గ్రిల్స్, డోర్ గ్రిల్స్ కు రాసి పెట్టడం వల్ల గాలి వీచినప్పుడు మంచి వాసన వస్తుంది.

2. పరిశుభ్రత: రగ్గులు, అలంకార దిండ్లు, పరుపులు, కర్టెన్‌లను కడిగి శుభ్రంగా ఉంచండి. మీ అలంకరణ దిండ్లు, కర్టెన్లు, రగ్గు లేదా కార్పెట్‌లను కనీసం నెలకు ఒకసారి శుభ్రంగా ఉంచుకోవాలి. రగ్గుపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లి కొన్ని గంటలపాటు అలాగే ఉంచండి. ఇది వాసనలను గ్రహిస్తుంది.

ఇవి కూడా చదవండి

3. కిటికీలు తెరిచి ఉంచండి: మీ ఇంటికి మంచి వాసన వచ్చేలా చేయడానికి సులభమైన మార్గం ఏమిటంటే, అన్ని కిటికీలను కొద్దిసేపు తెరిచి ఉంచాలి. ఇది తక్షణమే మొత్తం గదిని శుభ్రపరుస్తుంది. ఇంట్లోకి సహజమైన గాలిని ప్రవహిస్తుంది.

4. సువాసననిచ్చే వస్తువులు: మీ ఇంటిని సువాసనగా ఉంచేందుకు ఇప్పుడు మార్కెట్‌లో అనేక సువాసనగల వస్తుసామాగ్రి అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనండి, మీ ఇంట్లో ప్రతి మూలలో ఉంచండి. ఇది మీ ఇంటి నుండి చెడు వాసనలను తొలగించి, సువాసన భరితంగా మార్చేందుకు సహాయపడుతుంది.

5. సువాసననిచ్చే నూనెలు: ఇంటికి తాజా, చక్కని సువాసన ఇవ్వడానికి పుష్కలంగా ముఖ్యమైన నూనెలు అందుబాటులో ఉన్నాయి. రోజ్మేరీ, నిమ్మకాయ, పిప్పరమింట్ మరియు దాల్చిన చెక్క నారింజ వంటి నూనెలతో కూడిన ముఖ్యమైన నూనె డిఫ్యూజర్‌ను ఉపయోగించండి. ఇది మీ ఇంటిని నెలల తరబడి సువాసనగా ఉంచుతుంది.

6. సువాసన గల కొవ్వొత్తులు: ఇంట్లో సువాసనగల కొవ్వొత్తులు, అగరబత్తీలు, చందనం, అగరబత్తీలు వెలిగించండి. ఇది మీ ఇంటికి మంచి సువాసన రావడానికి సహాయపడుతుంది.

7. ఆరెంజ్: సిట్రస్ జాతికి చెందిన ఏరకం పండ్లైనా సరే మీ ఇంట్లో సువాసనలు వెదజల్లుతాయి.. ఎందుకంటే వాటి స్వభావమే అంత. ఆరెంజ్ లేదా నిమ్మను ఒక గుండు సూదితో కాయ మొత్తం అక్కడక్కడ గుచ్చి వంటగదిలో ఉంచండి . అంతే ఇళ్ళంతా మంచి వాసనతో నిండిపోతుంది.

8. దాల్చిన చెక్క :

దాల్చిన చెక్క వల్ల మీ ఇంట్లో ఒక అందమైన సహజమైన ప్రకృతి సిద్దమైన వాసన వెదజల్లుతుంది. మరి ఈ వాసన మీ ఇంట్లో నిండిపోవాలంటే, దాల్చిన చెక్క పొడి కానీ, లేదా దాల్చిన చెక్కను కానీ ఇంట్లో కిటీకీల దగ్గర లేదా డోర్ దగ్గర పెట్టాలి.

9. లెమన్ గ్రాస్: 

అందమైన తొట్లలో ఇంట్లో లెమన్ గ్రాస్ ను నాటి పెట్టుకోవచ్చు. దీన్ని ముఖద్వారం వద్ద వుంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దాంతో ఇంట్లో ఒక మంచి సువాసన నేచురల్ గా ఉంటుంది.

10. ఇండోర్ మొక్కలు:

కొన్ని ప్రత్యేకమైన మూలికలకు సంబంధించినవి ఇండోర్ మొక్కలుగా పెంచుకోవచ్చు. తులసి, మరువం, పుదీనా, కొత్తిమీర, వంటి మొక్కలను ఇండోర్లో పెంచుకోవడం వల్ల మంచి సువాసన అందిస్తుంది.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: