AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2023లో మహాశివరాత్రి ఎప్పుడు ? లింగోద్భవ తేదీ ఎప్పుడో తెలుసుకుందాం..

మహాశివరాత్రి కోసం శివ భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మహాశివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది.

2023లో మహాశివరాత్రి ఎప్పుడు ? లింగోద్భవ తేదీ ఎప్పుడో తెలుసుకుందాం..
Mahashivratri
Jyothi Gadda
| Edited By: Anil kumar poka|

Updated on: Nov 28, 2022 | 3:02 PM

Share

మహాశివరాత్రి కోసం శివ భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మహాశివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. శివపార్వతుల కళ్యాణం జరిగిన ఈ రోజు శివపార్వతుల ఆశీస్సుల కోసం భక్తులు ఉపవాసం, జాగరణ పాటిస్తారు. ఈ రోజున శివునికి ప్రత్యేక ప్రతిష్ఠాపన, పూజలు జరుగుతాయి. పంచామృతాలతో శివుని రుద్రాభిషేకం జరుగుతుంది. బిల్వ పత్ర, వివిధ రకాల పుష్పాలను శివునికి సమర్పిస్తారు. ఫాల్గుణ మాస చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు. 2023లో మహాశివరాత్రి ఫిబ్రవరి 18న వచ్చింది. 2023లో మహాశివరాత్రి పండుగను ఫిబ్రవరి 18 శనివారం రోజున వచ్చింది. ఫాల్గుణ మాసంలోని చతుర్దశి తిథి ఫిబ్రవరి 17న రాత్రి 8:02 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 18న సాయంత్రం 4:18 గంటలకు ముగుస్తుంది. మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరించే భక్తులకు ఫిబ్రవరి 19న ఉదయం 06:57 నుండి మధ్యాహ్నం 3:33 వరకు పారణకు శుభ సమయం.

మహాశివరాత్రి రోజున శివలింగానికి పంచామృత అభిషేకం చేయాలి. భక్తితో పాలు, నెయ్యి, పంచదార, తేనె, పెరుగు, గంగాజలాన్ని ఆ మహాశివుడికి సమర్పించుకుంటారు భక్తులు. కుంకుమపువ్వు కలిపిన నీటిని నైవేద్యంగా పెట్టడం చాలా శుభప్రదం. చందనంతో అడ్డనామాలు పెడతారు. బిల్వపత్రం, చెరుకు రసం, పువ్వులు, పండ్లు, స్వీట్లు, పరిమళ ద్రవ్యాలు, వస్త్రాలు సమర్పించాలి. ఈ రోజున శివునికి పాయసం,అరటిపండును సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీపం వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. . అభిషేకం తర్వాత ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది.

జీవితంలో ఆటంకాలు , సమస్యలు తొలగిపోవాలంటే మహాశివరాత్రి రోజున ఉపవాసం పాటించాలి. శివునికి నల్ల నువ్వులు సమర్పించాలి. మరుసటి రోజు అనాథలకు, నిస్సహాయులకు,నిరుపేదలకు దానం చేయాలి,భోజనం పెట్టాలి. దీని తర్వాత మీరు మీ ఉపవాసాన్ని ముగించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి