ఎలక్ట్రీషియన్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పిల్లి..! వైరలవుతున్న వీడియో చూస్తే ఫ్యూజులు అవుట్..

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Nov 26, 2022 | 7:58 PM

ఆ వీడియోలో ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ పనులు చేస్తూ కనిపించాడు. వీడియోలో అతని పక్కనే ఉన్న ఫ్రిజ్ పైన పిల్లి కూడా కూర్చుని ఉంది.

ఎలక్ట్రీషియన్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పిల్లి..! వైరలవుతున్న వీడియో చూస్తే ఫ్యూజులు అవుట్..
Cat Assists An Electrician

మనం ప్రతిరోజూ సోషల్ మీడియాలో రకరకాల జంతువుల వీడియోలు చూస్తుంటాం. పెంపుడు కుక్కలు, పిల్లుల వీడియోలు అనేకం ప్రతినిత్యం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంటాయి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పిల్లి వీడియో ఒకటి నెటిజన్లు షాక్‌ అయ్యేలా చేస్తుంది. మేడ్ యు స్మైల్ ట్విట్టర్ పేజీ ద్వారా ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయబడింది.

ఆ వీడియోలో ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ పనులు చేస్తూ కనిపించాడు. వీడియోలో అతని పక్కనే ఉన్న ఫ్రిజ్ పైన పిల్లి కూడా కూర్చుని ఉంది. ఎలక్ట్రీషియన్ వైర్లను పైకి లేపినప్పుడు, పిల్లి దాని తల పైకెత్తి వాటిని చూడటానికి, పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోని ఇప్పటి వరకు 56 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. చాలా మంది వీడియో కింద కామెంట్స్ కూడా రకరకాల పోస్ట్ చేశారు. పిల్లి చేష్టలు చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. అదే సమయంలో కొందరు నెటిజన్లు విపరీతంగా కామెంట్‌ చేశారు. ఇది ప్రమాదం అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu