Coconut shell: జుట్టును నల్లగా మార్చే కొబ్బరి చిప్ప..! ఇంకేన్నీ ప్రయోజనాలో తెలిస్తే ముక్క కూడా వదలిపెట్టరు.

కొబ్బరి చిప్ప ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. పనికిరాదని విసిరిపారేసే కొబ్బరి పెంకు మనకు వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. కొబ్బరి పెంకును సరిగ్గా ఉపయోగించడం ద్వారా.. అనేక సమస్యలను పరిష్కరించవచ్చు. సాధారణంగా కొబ్బరికాయ పెంకును చెత్తలో పారవేస్తాం.

Coconut shell: జుట్టును నల్లగా మార్చే కొబ్బరి చిప్ప..! ఇంకేన్నీ ప్రయోజనాలో తెలిస్తే ముక్క కూడా వదలిపెట్టరు.
Coconut Shell
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 26, 2022 | 7:42 PM

కొబ్బరి శాస్త్రీయ నామం ‘కోకాస్ న్యూసిఫెరా’. కోకాస్ ప్రజాతిలో ఇది ఒక్కటే జాతి ఉంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కొబ్బరి చెట్టు 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కొబ్బరి కాయ రూపంలో కొబ్బరి చెట్ల నుండి లభిస్తుంది. హిందువులకు ఒక ముఖ్యమైన పూజా ద్రవ్యం. దీనినే టెంకాయ అని కూడా పిలుస్తాం. దీనిని రకరకాల ఆహార పదార్థాలలో రకరకాల రూపాలలో వినియోగిస్తారు. కొబ్బరి చెట్లనుండి వివిధరకాల పదార్ధాలు అనేకమైన పద్ధతులలో ఉపయోగపడుతున్నాయి. అయితే, కొబ్బరి తిన్న తర్వాత దాని చిప్పను పారేస్తాం. వయస్సుతో సంబంధం లేకుండా మనమందరం దీన్ని చేస్తాము. కానీ కొబ్బరి చిప్ప ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. పనికిరాదని విసిరిపారేసే కొబ్బరి పెంకు మనకు వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. కొబ్బరి పెంకును సరిగ్గా ఉపయోగించడం ద్వారా.. అనేక సమస్యలను పరిష్కరించవచ్చు. సాధారణంగా కొబ్బరికాయ పెంకును చెత్తలో పారవేస్తాం. అందులో పొందుపరిచిన ప్రయోజనాలేంటో తెలుసుకుంటే ఇకపై చిన్న ముక్క కూడా వృధా కాదు. కొబ్బరి చిప్పను ఎలా ఉపయోగించాలి? మనకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

కొబ్బరి చిప్ప ప్రయోజనాలు.. కొబ్బరి చిప్ప పెంకును ఉపయోగించడం వల్ల గాయం వాపు తగ్గుతుంది. కొబ్బరి చిప్పను గ్రైండ్ చేసి పసుపు పొడిని కలిపి గాయమైన ప్రదేశంలో రాస్తే త్వరగా తగ్గుతుంది.

కొబ్బరి బెరడును రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల దంతాల మీద పసుపు మరకలు కూడా తొలగిపోతాయి. ఇందుకోసం ముందుగా కొబ్బరి పీచును కాల్చి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పొడిని కొద్దిగా సోడాతో కలిపి దంతాల మీద క్రమం తప్పకుండా మర్దన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

బాణలిలో కొబ్బరి చిప్పను వేడి చేయండి. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని కొబ్బరి నూనెతో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేసి 1 గంట తర్వాత కడిగేయండి. ఇలా నిరంతరం చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.

కొబ్బరి చిప్పను మెత్తగా నూరి ఆ పొడిని రోజూ ఉదయం ఖాళీ కడుపుతో నీటితో కలిపి తింటే పైల్స్ సమస్య పూర్తిగా నయమవుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి