AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Health: గుండె ఆరోగ్యం కోసం ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.. దీర్ఘాయుష్షు కూడా పొందొచ్చు..

శరీరంలోని ప్రధాన అవయవాలలో గుండె ఒకటి. ఇది ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలోని జీవక్రియలన్ని సక్రమంగా జరుగుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే గుండె జబ్బులను నివారించవచ్చు. ప్రస్తుత కొవిడ్‌ సమయంలో..

Heart Health: గుండె ఆరోగ్యం కోసం  ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.. దీర్ఘాయుష్షు కూడా పొందొచ్చు..
Heart Attack
Amarnadh Daneti
|

Updated on: Nov 26, 2022 | 6:48 PM

Share

శరీరంలోని ప్రధాన అవయవాలలో గుండె ఒకటి. ఇది ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలోని జీవక్రియలన్ని సక్రమంగా జరుగుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే గుండె జబ్బులను నివారించవచ్చు. ప్రస్తుత కొవిడ్‌ సమయంలో గుండె సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా హార్ట్‌ ఎటాక్‌తో తొమ్మిది మిలియన్లకు పైగా జనాలు చనిపోతున్నారు.  ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాలలో  దాదాపు 16 శాతానికి  పైగా గుండెపోటు కారణంగానే మరణిస్తున్నారు. ఈ మరణాలలో ఆరు మిలియన్లకు పైగా 30 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే.  ఆరోగ్యవంతమైన గుండె కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

మానసిక ఆరోగ్యంపై అప్రమత్తత

ప్రతి ఒక్కరు మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే వివిధ రకాల రుగ్మతల బారిన పడుతారు. దీనివల్ల గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. మీకు మనసు బాగా లేనప్పుడు నచ్చిన ప్రదేశాలకు వెళ్లండి. విటమిన్లు, పోషకాలను కోల్పోకుండా వైద్యుడిని సంప్రదించండి. ప్రతిరోజు యోగా, ధ్యానం, చేయండి

ఆహారంలో ఉప్పు నియంత్రణ

ఆరోగ్యకరమైన గుండె కోసం  సాధారణ బీపీని కలిగి ఉండాలి. ఉప్పులో సోడియం ఉంటుంది ఇది రక్తపోటును సాధారణం కంటే పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ మీరు అదనపు ఉప్పును తీసుకోకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఊరగాయలు, పాపడ్‌లు, ప్రిజర్వ్‌లు, చిప్స్, పిజ్జాలు, చీజ్, పాశ్చరైజ్డ్ బటర్ మొదలైన వాటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. వీటిని తినడం మానుకోవాలి. ఇది మూత్రపిండాలకు కూడా హాని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

నిర్ణీత సమయం నిద్ర

అసంపూర్ణ మైన నిద్ర మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.  పని ఉత్పాదకతను, అర్థం చేసుకునే తత్వాన్ని, మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చాలా రోజులు ఇలాగే జరిగితే గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట నిద్ర పట్టకపోతే పాలు తాగడం లాంటి హోమ్‌ రెమిడీస్ పాటించాలి. టీ, కాఫీలను తీసుకోకూడదు.

గుండెకి మేలు చేసే ఆహారం

ప్రతిరోజు 2 పండ్లు, 3 కూరగాయలను డైట్‌ లో చేర్చుకుంటే ఎక్కువ కాలం జీవించవచ్చు.  ఈ ఆహారం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శాఖాహారం ఆరోగ్యానికి ఎల్లప్పుడు మంచిది. ఇందులో గుండెకి అవసరమయ్యే అన్ని పోషకాలు లభిస్తాయి. మాంసాహారంలో కొన్ని మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా ఇవి గుండెపై ఒత్తిడి పెంచుతాయి.

యాక్టివ్‌గా ఉండండి

మనిషి యాక్టివ్‌గా ఉన్నప్పుడు శరీరంలో అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం కచ్చితంగా చేయాలి. రోజు 10,000 అడుగులు నడవాలి. వారానికి మూడు నుంచి ఐదు సార్లు కనీసం 30 నిమిషాల మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయాలి. ప్రతి గంటకు ఐదు నిమిషాల నడక తప్పనిసరి. ఒకేచోట ఎప్పుడు కూర్చొని పనిచేయకూడదు. ఇది గుండెజబ్బులకి కారణం అవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..