AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology Tips: ఇంట్లో ఇలాంటి చెట్లను ఎప్పుడూ ఉపయోగించకండి.. ఆర్థిక నష్టం!

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో మూడు ప్రత్యేక రకాల చెక్కలను ఉంచడం అశుభం. కాబట్టి మీరు అలాంటి వస్తువును కొనుగోలు చేసినప్పుడల్లా ముందుగా దాని తయారీకి ఎలాంటి కలపను ఉపయోగించారో తెలుసుకోవటం ముఖ్యం.

Astrology Tips: ఇంట్లో ఇలాంటి చెట్లను ఎప్పుడూ ఉపయోగించకండి.. ఆర్థిక నష్టం!
Wood
Jyothi Gadda
|

Updated on: Nov 26, 2022 | 7:16 PM

Share

ఇటీవల భవన నిర్మాణంలో వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా పాటిస్తున్నారు.. ప్రతి వ్యక్తి తన ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటున్నాడు. ఇంటి ఇంటీరియర్ డెకరేషన్ కూడా వాస్తు ప్రకారం చేయడం మొదలుపెట్టారు. తమ ఇంటిని అలంకరించడానికి వివిధ రకాల చెక్క వస్తువులతో సహా అనేక వస్తువులను ఉపయోగిస్తుంటారు. కానీ, ఇది ఎల్లప్పుడూ శ్రేయస్కరం కాదు.. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో మూడు ప్రత్యేక రకాల చెక్కలను ఉంచడం అశుభం. కాబట్టి మీరు అలాంటి వస్తువును కొనుగోలు చేసినప్పుడల్లా ముందుగా దాని తయారీకి ఎలాంటి కలపను ఉపయోగించారో తెలుసుకోవటం ముఖ్యం. వాస్తులో పేర్కొన్న విధంగా ఇంటి అలంకరణకు ఏ చెట్లను ఉపయోగించవచ్చో, ఏ చెట్లను ఉపయోగించకూడదో కూడా తెలుసుకోండి.

పాలుగారే చెట్లు.. మీరు చాలా చోట్ల పాలుగారే చెట్లను చూసి ఉంటారు. వాటి కొమ్మలు, ఆకులు విరిగిపోయినప్పుడు, వాటి నుండి తెల్లటి అంటుకునే పదార్థం బయటకు వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం అటువంటి చెక్క లేదా, దానితో చేసిన వస్తువులను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. రబ్బరు చెట్టు,అక్ చెట్టు అనే రెండు చెట్లు ఈ తెల్లటి జిగురును విడుదల చేస్తాయి. పొరపాటున ఇంట్లోకి వీటి కలప లేదంటే దానితో తయారు చేసిన ఉత్పత్తులను తీసుకురావద్దు.దీని వలన ఇంట్లో ఆర్థిక నష్టం జరుగుతుందని నమ్ముతారు.

శ్మశాన వాటికలో పెరుగుతున్న చెట్లు.. శ్మశానవాటికలోని కలపను ఆభరణం, విగ్రహం లేదా ఫ్రేమ్ చేయడానికి ఉపయోగించినట్లయితే దానిని ఇంటికి తీసుకురావద్దు. ఈ రకమైన చెట్టు ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావాన్ని పెంచుతుంది. శ్మశాన వాటికలో పెంచే చెట్లు ఇంటి ఆర్థిక శ్రేయస్సును పాడు చేస్తాయి. శ్మశాన వాటికలో చితి కాల్చడానికి ఉపయోగించే కలపను కూడా ఇంటికి తీసుకురాకూడదు. అలాంటి చెట్టు ఇంటి నుండి దూరంగా ఉంటే మంచిది. లేదంటే ఇంట్లో ప్రతికూలత ప్రబలుతుంది .

ఇవి కూడా చదవండి

బలహీనమైన, పొడి చెట్లు.. బలహీనమైన లేదా పొడి చెక్కను అలంకార వస్తువు లేదా విగ్రహాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తే దానిని ఇంటికి తీసుకురావద్దు. అలాగే చెదపురుగులు లేదా చీమల ద్వారా పుచ్చుకున్న కలపను ఉపయోగించవద్దు. దీంతో ఇంట్లో ఇబ్బందులు తలెత్తుతాయి.

ఎండిపోయిన ఆకులు, రెండు ఎండు కొమ్మలు లేదా కలపతో చేసిన ఉత్పత్తులను ఇంటికి తీసుకురాకూడదు. అవి ఇంటిల్లి పాదిని మరింత ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

మరిన్ని వాస్తు సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి