TTD News: శ్రీవారి భక్తులకు శుభవార్త.. సామాన్యులకు పెద్ద పీట వేస్తూ కీలక నిర్ణయం.. డిసెంబర్‌ నుంచే అమల్లోకి..

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎంత ఆసక్తి చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ ఏటా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సాధారణ రోజుల్లో తిరుమల వెంకన్నను సగటున 80 వేల మంది దర్శించుకుంటే, వారాంతాల్లో..

TTD News: శ్రీవారి భక్తులకు శుభవార్త.. సామాన్యులకు పెద్ద పీట వేస్తూ కీలక నిర్ణయం.. డిసెంబర్‌ నుంచే అమల్లోకి..
Tirumala
Follow us

|

Updated on: Nov 26, 2022 | 5:56 PM

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎంత ఆసక్తి చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ ఏటా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సాధారణ రోజుల్లో తిరుమల వెంకన్నను సగటున 80 వేల మంది దర్శించుకుంటే, వారాంతాల్లో ఈ సంఖ్య లక్ష దాటేస్తోంది. ఇదిలా ఉంటే శ్రీవారిని దర్శించుకునేందుకు వీఐపీలు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. వీరితో పాటు వీరి సిఫారసు లేఖల ద్వారా స్వామి వారిని దర్శించుకునే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో సామాన్య భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడే పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలోనే వీఐపీ బ్రేక్‌ దర్శనాల విషయంలో టీటీడీ పలు మార్పులు చేస్తూ వచ్చింది. మొదట్లో ఉదయం, సాయంత్రం బ్రేక్‌ దర్శనం ఉండగా ప్రస్తుతం కేవలం ఉదయం మాత్రమే బ్రేక్‌ దర్శనాన్ని కల్పిస్తూ వస్తోంది. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు బ్రేక్‌ దర్శనం కల్పిస్తున్నారు. అయితే రాత్రంతా క్యూలైన్లలో ఎదురు చూసే సామాన్య భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇకపై సామాన్య భక్తుల తర్వాతే వీఐపీలకు దర్శనం కల్పించనున్నారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు సాగే బ్రేక్‌ దర్శనం సమయాల్లో మార్పులు చేయనున్నారు.

డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్‌ దర్శనాలను కల్పించనున్నారు. దీంతో స్వామి వారికి నిత్య కైంకర్యాలు పూర్తయిన వెంటనే రాత్రంతా క్యూలైన్లలో ఉన్న భక్తులకు దర్శనం కల్పించనున్నారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంతో భక్తులకు త్వరగతిన శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది. దీంతో గదుల కేటాయింపులపై కూడా ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్‌ నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.