FIFA World Cup 2022: భర్తలు మ్యాచ్ గెలిచిన ఆనందంలో తెగ తాగేసిన భార్యలు.. బిల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Cruise Liner: ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2022 ఖతార్‌లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టు మైదానంలో సత్తా చాటుతోంది.
ఇరాన్‌పై ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు విజయం సాధించగానే ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోయారు. అయితే, ఆనందాన్ని ఆటగాళ్ల భాగస్వాములు కూడా భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, అందులో విశేషం ఏంటని ఆలోచిస్తున్నారా.. అందులోనే అసలు విషయం దాగుంది. ఓ నివేదిక ప్రకారం, ఇంగ్లండ్ ఆటగాళ్ల భాగస్వాములు ఈ విజయాన్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, ఆ ఆనందంలో విపరీతంగా మద్యం సేవించారు. కాగా, వారి బిల్లు లక్షల్లోకి చేరుకుంది. ఆటగాళ్ల భార్యలు దాదాపు 98 బిలియన్ల విలువైన లగ్జరీ షిప్‌లో ఉన్నారు.
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2022 ఖతార్‌లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టు మైదానంలో సత్తా చాటుతోంది. అదే సమయంలో జట్టును ప్రోత్సహించడానికి ఆటగాళ్ల భాగస్వాములు కూడా దోహాలో ఉన్నారు. ఇరాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపొందడంతో ఆటగాళ్ల భాగస్వాములు సంబరాలు చేసుకున్నారు. భారీగా మద్యం సేవించారు. హ్యారీ మాగ్వైర్ భార్య ఫెర్న్, జోర్డాన్ పిక్‌ఫోర్డ్ స్నేహితురాలు మేగాన్, జాక్ గ్రీలిష్ భార్య సాషా అట్‌వుడ్ స్టేడ్ పార్టీ చేసుకున్న వారిలో ఉన్నారు.
బిల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..
ఇంగ్లీష్ వెబ్‌సైట్ ‘ది సన్’ ప్రకారం, ‘ఇంగ్లీష్ ఆటగాళ్ల భాగస్వాములు లగ్జరీ క్రూయిజ్‌లో ప్రీమియం ప్యాకేజీ తీసుకున్నారు. ఖతార్ చేరుకోవడానికి ముందే ఈ చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. 250-పౌండర్లు పాప్‌లో షాంపైన్ బాటిళ్లను అలాగే కాక్‌టెయిల్‌లను ఆర్డర్ చేశారు. ఇంగ్లీష్ ఆటగాళ్ల భాగస్వాములు 20000 పౌండ్ల (సుమారు రూ. 20 లక్షలు) మద్యం సేవించారంట.
లగ్జరీ షిప్‌లో ఇంగ్లీష్ ప్లేయర్‌ల భాగస్వాములు..
6,762 మంది సామర్థ్యం కలిగిన సుమారు 98 బిలియన్ల విలువైన లగ్జరీ షిప్‌లో ఇంగ్లీష్ ఆటగాళ్ల భాగస్వాములు ఉన్నారంట. ఇందుకోసం దాదాపు రూ. 6 లక్షలు చెల్లించారంట. ఈ క్రూయిజ్ దోహాలో సముద్రంపై ఉంటుంది. ఫిఫా ప్రపంచకప్ నడుస్తున్నంత కాలం, ఈ క్రూయిజ్ దోహా సముద్ర తీరంలో నిలుస్తుంది. 21 అంతస్తులలో విస్తరించి ఉన్న ఈ నౌకలో 2500 కంటే ఎక్కువ క్యాబిన్‌లు ఉన్నాయి.
లగ్జరీ షిప్‌లో 643 అడుగుల బహిరంగ విహార ప్రదేశం, 14 కొలనులు, 13 డైనింగ్ స్పాట్‌లు, 30 కంటే ఎక్కువ బార్‌లు, రెస్టారెంట్లు ఉన్నాయి. పిల్లలు, పెద్దలకు కూడా ఈ నౌకలో చాలా సౌకర్యాలు ఉన్నాయి.
ఇంగ్లాండ్ మొదటి మ్యాచ్‌లో ఇరాన్‌ను 6-2తో ఓడించింది. ఆ తర్వాత USAపై 0-0తో డ్రాగా ముగిసింది. అల్ బైత్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు ఎన్నో అవకాశాలు సృష్టించుకున్నా గోల్ చేయలేకపోయారు. ఇంగ్లిష్ కెప్టెన్ హ్యారీ కేన్ ఈ మ్యాచ్‌లో బాగా ఆడతాడని భావించినా అతని ప్రదర్శన నిరాశపరిచింది. గ్రూప్-బిలో ప్రస్తుతం ఇంగ్లండ్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇరాన్ మూడు పాయింట్లతో రెండో స్థానంలో, అమెరికా 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..