FIFA WC 2022: మ్యాచ్‌కు ముందు ఆటగాళ్ల ‘శృంగారం’.. కీలక వ్యాఖ్యలు చేసిన స్పెయిన్ కోచ్..
Spain Team Coach Luis Enrique: ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా ఆటగాళ్ల వ్యక్తిగత జీవితం ముఖ్యాంశాలలో ఉంటుంది. స్పెయిన్ జట్టు కోచ్ తన ఆటగాళ్ల లైంగిక జీవితంపై వ్యాఖ్యానించాడు, ఇది చాలా చర్చనీయాంశమైంది. లూయిస్ ఎన్రిక్ ఇలా ఏం చెప్పాడో తెలుసా..
ఫిఫా వరల్డ్ కప్ 2022 జరుగుతున్న ఖతార్‌పై ప్రస్తుతం ప్రపంచం మొత్తం దృష్టి కేంద్రీకరించిన సంగతి తెలిసిందే. టోర్నీ ప్రారంభమై దాదాపు వారం రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు పలు ఆసక్తికర మ్యాచ్‌లు జరిగాయి. వాటితోపాటే వివాదాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వివిధ జట్లు మొత్తం టోర్నమెంట్ కోసం తమ ఆటగాళ్ల కోసం కొన్ని నియమాలను కూడా రూపొందించాయనే వార్తలు కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. స్పెయిన్ కోచ్ లూయిస్ ఎన్రిక్ తన జట్టు ఆటగాళ్లకు సెక్స్ గురించి కొన్ని కీలక ప్రకటనలు చేశాడం. ఇది ప్రస్తుతం కీలకంగా మారింది.
ప్రపంచకప్ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు సెక్స్‌లో పాల్గొనడంలో తప్పు లేదని స్పానిష్ జట్టు కోచ్ లూయిస్ అన్నారు. లూయిస్ ప్రకారం, ఆటగాళ్లు వాళ్ల భార్య లేదా ప్రియురాలితో సెక్స్ చేయడంలో తప్పేంలేదు. ఇందులో సమస్య ఏముంటుంది. ఇది వద్దనడం తప్పే. ప్రపంచకప్‌లో ఒత్తిడి ఉంటుంది. ఆటగాళ్లు తమ మనస్సును తాజాగా ఉంచుకోవాలనుకుంటున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు.
‘నేను ప్లేయర్‌గా ఉన్నప్పుడు కూడా ఇవి మాకు సాధారణమైన విషయమే’ అని లూయిస్ అన్నారు. FIFA ప్రపంచ కప్ 2022లో స్పెయిన్ ఇప్పటివరకు ఒక మ్యాచ్ ఆడింది. అందులో కోస్టారికాను 7-0తో ఓడించింది. స్పెయిన్ తర్వాతి మ్యాచ్ జర్మనీతో నవంబర్ 28న జరగనుంది.
కాగా, ఈసారి ఖతార్‌లో చాలా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కోపంగా ఉన్నారు. ఖతార్‌లో ఆల్కహాల్, స్మోకింగ్, సెక్స్‌కి సంబంధించి వివిధ ఆంక్షలు ఉన్నాయి. అమ్మాయిలు పొట్టి దుస్తులు ధరించడం కూడా నిషేధించిన సంగతి తెలిసిందే.
స్పెయిన్ జట్టులో ఫెర్రాన్ టోర్రెస్, డాని ఓల్మో, మార్కో, కార్లోస్ సోలెర్, అల్వారో మొరాటా వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. విశేషమేమిటంటే స్పెయిన్ స్టార్ ఆటగాడు ఫెర్రాన్ టోరెస్ తన కోచ్ లూయిస్ ఎన్రిక్ కుమార్తెతో డేటింగ్ చేస్తున్నాడు. ప్రపంచకప్‌నకు ముందు ఫెరాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..