Horoscope Today: వీరికి అదనపు ఖర్చులు, శ్రమాధిక్యం.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. గొప్ప వారితో పరిచయం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. అదనపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయ స్వామిని పూజిస్తే శుభం కలుగుతుంది.

Horoscope Today: వీరికి అదనపు ఖర్చులు, శ్రమాధిక్యం.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope
Follow us
Basha Shek

|

Updated on: Nov 28, 2022 | 6:33 AM

మేషం

ఈ రాశివారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో ఆప్తుల సాయం అందుతుంది. విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదిత్య హృదయం పఠిస్తే మేలు జరుగుతుంది.

వృషభం

బద్ధకాన్ని వీడితే మంచి ఫలితముంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధువులు, స్నేహితులు విభేదాలు రావచ్చు. ఇష్టదేవతారాధన చేస్తే మంచిది.

మిథునం

కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లాభిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కొన్ని విషయాల్లో తలదూర్చకపోవడమే మంచిది. వినాయకుడిని పూజిస్తే సమస్యలు తొలగుతాయి.

ఇవి కూడా చదవండి

కర్కాటకం

ఈరాశులవారికి అనుకూల సమయం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురువతాయి. లక్ష్మీఅష్టోత్తర శతనామావళి పఠిస్తే మేలు చేకూరుతుంది.

సింహం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని పెంచుతుంది. కీలక విషయాల్లో పెద్దల ప్రశంసలు పొందుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది.

కన్య

ఈ రాశివారు సానుకూల ఫలితాలను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా మంచి చేకూరుతుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం పఠిస్తే మేలు చేకూరుతుంది.

తుల

చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. గొప్ప వారితో పరిచయం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. అదనపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయ స్వామిని పూజిస్తే శుభం కలుగుతుంది.

వృశ్చికం

ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.

ధనస్సు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సహకారం లాభిస్తుంది. సమయస్ఫూర్తి, తెలివితేటలతో కొన్ని కీలక పనులు పూర్తిచేస్తారు.ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణం చేయడం మంచిది.

మకరం

చేపట్టిన పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఎదురువతాయి. కీలకమైన వ్యవహారాలు ఆలస్యమవుతాయి. ఉన్నత అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానంతో మేలు చేకూరుతుంది.

కుంభం

చేపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చులు అదుపుచేసుకోవాలి. శ్రమాధిక్యం తప్పదు. సాయి నామాన్ని స్మరిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు.

మీనం

వీరికి శుభఘడియలు నడుస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు ఆనందాన్ని నింపుతాయి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి