Education: జీవితంపై విద్య ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా.. విలాసవంతమైన జీవినశైలిని ఆస్వాదించడంలోనూ ఇబ్బందులు..

నేటి ఆధునిక కాలంలో విద్య ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే గతంలో పరిస్థితుల కారణంగా తాము చదవుకోలేకపోయామని, తమ పిల్లలను బాగా చదివించాలనే పట్టుదలతో చాలా మంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ..

Education: జీవితంపై విద్య ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా.. విలాసవంతమైన జీవినశైలిని ఆస్వాదించడంలోనూ ఇబ్బందులు..
Education
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 28, 2022 | 7:00 AM

నేటి ఆధునిక కాలంలో విద్య ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే గతంలో పరిస్థితుల కారణంగా తాము చదవుకోలేకపోయామని, తమ పిల్లలను బాగా చదివించాలనే పట్టుదలతో చాలా మంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ పిల్లలను చదివిస్తున్నారు. విద్య జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ముందు ఎంత ఆస్తి ఉందనే దానికంటే.. ఆ వ్యక్తి చదువుకున్నాడా లేదా అనేదానిపైనే ఆ వ్యక్తి జీవితం ఆధారపడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అక్షరాస్యులకు, నిరక్షరాస్యులకు మధ్య చాలా తేడా ఉంటుంది. చదవుకోలేని వారు అన్ని విధాలా ఎక్కువుగా మోసపోవడానికి అవకాశం ఉంటుంది. అదే చదువుకున్న వారు మోసపోవడానికి అవకాశం ఉన్నప్పటికి.. నిరక్షరాస్యులతో పోలిస్తే ఈ శాతం తక్కువుగానే ఉంటుంది. ఇప్పటికి చాలా మంది తాము చదువుకుని ఉంటే ప్రస్తుతం ఇన్ని ఇబ్బందులు పడే వాళ్లం కాదంటూ బాధపడుతూ ఉంటారు. దీనిని బట్టి విద్య ఓ వ్యక్తి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఓ వ్యక్తి ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారనే విషయం పరిశీలించినప్పుడు.. ఈ అంశం విద్యతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుందని మనీ9 సర్వేలో వెల్లడైంది. ఓ వ్యక్తి చదువుకున్నవారైతే వారు విలాసవంతమైన జీవనశైలిని గడుపుతారు. చదువుకోలేని వ్యక్తులు అక్షరాస్యులతో పోలిస్తే జీవనశైలిలో కొంత వ్యతాసం కనిపిస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే చదువుకోలేని వ్యక్తుల జీవితమంతా పోరాటాలతో నిండి ఉండవచ్చు. దేశంలోని 20 రాష్ట్రాల్లోని 100 కంటే ఎక్కువ జిల్లాల్లోని 31వేల కుటుంబాలకు పైగా సర్వే చేయగా.. నిరక్షరాస్యులు లేదా కనీసం పాఠశాల విద్య లేని వారిలో 1 శాతం కూడా విలాసవంతమైన జీవనశైలిని ఆస్వాదించడం లేదని తేలింది. అలాగే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 75 శాతం కుటుంబాలు తమ రోజువారీ ఖర్చులకు సరిపడా సంపాదిస్తున్నాయని సర్వేలో వెల్లడైంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్, సాంకేతిక విద్యను పూర్తి చేసిన వారిలో సగం మంది ప్రాథమిక జీవనశైలి కంటే సాధారణ జీవనశైలిని ఆస్వాదిస్తున్నారు.

అక్షరాస్యులకు, నిరక్షరాస్యులకు మధ్య జీవనశైలిలో స్పష్టమైన తేడా ఉన్నట్లు సర్వేలో తేలింది. అలాగే ఆలోచనా విధానంలోనూ ఎంతో వ్యతాసం ఉంది. తమ జీవితంపై ప్రణాళిక విషయంలో కూడా వీరిద్దరి మధ్య తేడా కనిపిస్తోంది. ఎక్కువ శాతం మంది తమ శ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా పొదుపు విషయంలో కూడా చదువుకున్న వారు, చదువుకోలేని వారికి మధ్య తేడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే