Banking: ఎటిఎమ్ కార్డు బ్లాక్ అయిందా.. ఆందోళన అవసరం లేదు.. సేవల పునరుద్ధరర కోసం ఇలా చేయండి..
ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రంగంలోనూ డిజిటల్ సేవలు విస్తృతమయ్యాయి. దీంతో గతంతో పోలిస్తే ఎటిఎంల వినియోగం తగ్గింది. కాని ఎక్కువ మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేయాలన్నా, అత్యవసర సమయాల్లో లేదా డిజిటల్ పేమెంట్స్ సేవల్లో ఏవైనా..
ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రంగంలోనూ డిజిటల్ సేవలు విస్తృతమయ్యాయి. దీంతో గతంతో పోలిస్తే ఎటిఎంల వినియోగం తగ్గింది. కాని ఎక్కువ మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేయాలన్నా, అత్యవసర సమయాల్లో లేదా డిజిటల్ పేమెంట్స్ సేవల్లో ఏవైనా అంతరాయం ఏర్పడినప్పుడు ఏటిఎం కార్డు అవసరం ఏర్పడుతుంది. అయితే కొంతకాలంగా దానిని వాడకపోవడంతో పిన్ మర్చిపోయే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. దీంతో కొన్నిసార్లు మనకు గుర్తున్నా లేదా ఎక్కువుగా వినియోగించే పిన్‌లు కొట్టి ప్రయత్నిస్తాము. అయినా పిన్ గుర్తుండకపోవచ్చు. ఎక్కువ సార్లు రాంగ్ పిన్ ఎంటర్ చేస్తే ఏటిఎం కార్డు బ్లాక్ అవుతుంది. ఈ సమయంలో తిరిగి సేవలను ఎలా పునరుద్దరించుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. మరోవైపు మనకు తెలియకుండా ఎవరైనా మన కార్డు ఉపయోగిస్తే దానిని వెంటనే బ్లాక్ చేసుకోవచ్చు. ఒకసారి కార్డు బ్లాక్ చేస్తే.. తిరిగి కొత్త కార్డు పొందేవరకు ఏటిఎం కార్డుపై లావాదేవీలు నిలిచిపోతాయి. కార్డు బ్లాక్ చేస్తే మళ్లీ కార్డు పొందే విషయంలోనూ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
కోవిడ్ మహమ్మారి తర్వాత ఆన్ లైన్ లావాదేవీలు, డిజిటల్ పేమెంట్స్ పెరగడంతో ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ఎటిఎం) పిన్‌ను కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు. ఎప్పుడైనా ఏటిఎం అవసరం ఏర్పడినప్పుడు తప్పుడు పిన్ నెంబర్‌ను మూడు సార్లు ఎంటర్ చేస్తే కార్డు లాక్ చేయబడుతుంది. కొన్నిసార్లు అనుమానాస్పద కాల్ లేదా మెసెజ్‌ల కారణంగా బ్యాంక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించి కార్డు బ్లాక్ చేయమని వినియోగదారుడు అభ్యర్థించి ఉండవచ్చు. అలా చేసినప్పుడు కార్డ్‌పై సేవలు నిలిచిపోతాయి. అయితే ఎటిఎం కార్డు వినియోగం, సేవలను పునరుద్ధరించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందాం.
ఏటిఎం కార్డుని బ్లాక్ చేయడం ఎలా
వరుసగా మూడు సార్లు తప్పుడు పిన్ ఎంటర్ చేస్తే ఎటిఎం కార్డు దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి ఆటోమేటిక్‌గా లాక్ చేయబడుతుంది. అలాంటప్పుడు ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా కాస్త ఓపిక, సహనంతో వ్యవహరించడమే. ఎందుకంటే రాంగ్ పిన్ ఎంటర్ చేసిన కారణంగా లాక్ చేయబడిన కార్డు 24 గంటల నిర్ణీత వ్యవధి తర్వాత సేవలు పునరుద్దరించబడతాయి. ఒకవేళ భద్రతా కారణాల వల్ల లేదా నిర్లక్ష్యం కారణంగా కార్డ్ బ్లాక్ చేయబడినప్పుడు, మీ కార్డ్‌ని అన్‌బ్లాక్ చేయడానికి సమీపంలోని బ్యాంక్‌లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. దాని కోసం బ్యాంకుకు వెళ్లి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆధార్ లేదా మరేదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం ఏదైనా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, బ్యాంక్ మీ అభ్యర్థనను 48 గంటల నుండి గరిష్టంగా 5 పని దినాలలో ప్రాసెస్ చేస్తుంది. కార్డ్ గడువు ముగియడం వల్ల కార్డ్ బ్లాక్ అయినప్పుడు, ప్రతి ఏటిఎం కార్డ్ దాదాపు 3 నుంచి 5 సంవత్సరాల చెల్లుబాటుతో వస్తుంది. కొత్త కార్డ్ కోసం దరఖాస్తు చేస్తే 5 నుంచి7 పని దినాలలో బ్యాంకు కొత్త కార్డును అందిస్తుంది.\
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..