- Telugu News Photo Gallery Business photos Are you have home or bank loans, RBI may interest hike rates in December, know what experts say
లోన్ తీసుకున్న వారికి అలర్ట్.. డిసెంబర్‌లో మళ్లీ వడ్డీ రేట్లు పెరుగుతాయా..? నిపుణుల అంచనా ఇదే..
దేశంలో కరోనా నాటినుంచి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించేందుకు ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో వరుసగా రేపోరేట్లను పెంచుతూ వస్తోంది. ఇప్పటికే దాదాపు 190 బేసిస్ పాయింట్లను పెంచింది.
Updated on: Nov 28, 2022 | 1:14 PM

దేశంలో కరోనా నాటినుంచి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించేందుకు ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో వరుసగా రేపోరేట్లను పెంచుతూ వస్తోంది. ఇప్పటికే దాదాపు 190 బేసిస్ పాయింట్లను పెంచింది. దీంతో బ్యాంకు లోన్, కారులోన్, ఇంకా పర్సనల్ లోన్ తీసుకున్న వారికి భారంగా మారుతోంది. వడ్డీరేట్లు పెరగడంతో లోన్ వడ్డీ మరింత పెరుగుతోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెప్టెంబర్ 30న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) చివరి సమావేశంలో.. మే నుంచి వరుసగా నాలుగోసారి రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.

లిక్విడిటీని కఠినతరం చేయడం, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ ద్రవ్యోల్బణం ఇప్పటికీ 6 శాతం కంటే దిగువకు రావడంలో విఫలమైంది.

భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం గత 10 నెలలుగా ఆర్‌బిఐ కంఫర్ట్ జోన్ కంటే ఎగువన కొనసాగుతుండడంతో.. భవిష్యత్తులో మరింత పెంపుదల ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు

Money

ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి రెపో రేటు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అలా జరిగితే.. ఈఎంఐ, వడ్డీరేట్లు పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి రెపో రేటు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అలా జరిగితే.. ఈఎంఐ, వడ్డీరేట్లు పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు.




