Bengaluru: ర్యాపిడో క్యాబ్ బుక్ చేసుకున్న యువతిపై గ్యాంగ్ రేప్.. పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లి మరీ..
మహిళలు, యువతులు, చిన్నారులకు సమాజంలో రోజురోజుకు రక్షణ లేకుండా పోతోంది. దాడులు, అత్యాచారాలు, దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా,..
మహిళలు, యువతులు, చిన్నారులకు సమాజంలో రోజురోజుకు రక్షణ లేకుండా పోతోంది. దాడులు, అత్యాచారాలు, దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా, నిందితులను కఠినంగా శిక్షిస్తున్నా మార్పు రావడం లేదు. యథేచ్చగా నేరాలకు పాల్పడుతున్నారు. మరోవైపు.. నగరాల్లో గమ్య స్థానాలకు వెళ్లేందుకు ఎక్కువగా ఉపయోగించే కొన్ని యాప్ ల ద్వారా కూడా నేరాలు జరుగుతున్నాయి. బెంగళూరులో ఇలాంటి ఘటనే జరిగింది. ర్యాపిడో క్యాబ్ బుక్ చేసుకున్న యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. కారులో ఎక్కిన యువతిని బలవంతంగా పాడుబడిన ఇంటికి తరలించి క్యాబ్ డ్రైవర్, అతని స్నేహితుడు అత్యాచారం చేశారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధధిలో ఈ ఘటన జరిగింది.
బుధవారం తెల్లవారుజాము వరకూ పలుమార్లు అత్యాచారం చేసి అక్కడే యువతిని వదిలేసి వెళ్లిపోయారు. ఉదయం తేరుకున్న యువతి..లేచి చూసే సరికే తాను నిర్మానుష్య ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించింది. ధైర్యం తెచ్చుకుని చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనను తీవ్రంగా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టిన.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అడిగి ఘటన జరిగిన విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. కారు ఎక్కిన సమయంలో యువతి మద్యం మత్తులో ఉందని నిందితులు చెప్పడం గమనార్హం.
కాగా.. గతంలోనూ బెంగుళూరులో ఇలాంటి ఘటనే జరిగింది. కాలేజీకి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ యువతిని ఆటో డ్రైవర్‌తో పాటు అతని స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దారి మళ్లించి, నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి అత్యాచారం చేశారు. ఓ విద్యార్థిని బెంగళూరు నుంచి రైలులో షిమోగాకు వచ్చింది. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళేందుకు ఆటో మాట్లాడుకుంది. డ్రైవర్ కొద్దిదూరం వెళ్లాక దారి మళ్లించాడు. ఆ తర్వాత కొద్దిదూరం వెళ్లాక విద్యార్థినిని బెదిరించి నోట్లో గుడ్డలు కుక్కి చేతేలు కట్టేసి అత్యాచారానికి ఒడిగట్టారు. మొత్తం ఆరుగురు ఈ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..