AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat: సీఎం ప్రసంగిస్తుండగా దూసుకొచ్చిన ఎద్దు.. బీజేపీ కుట్రేనని ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు..

గుజరాత్‌లో ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. గుజరాత్ ఎన్నికలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్...

Gujarat: సీఎం ప్రసంగిస్తుండగా దూసుకొచ్చిన ఎద్దు.. బీజేపీ కుట్రేనని ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు..
Ashok Gehlot
Ganesh Mudavath
|

Updated on: Nov 29, 2022 | 8:53 PM

Share

గుజరాత్‌లో ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. గుజరాత్ ఎన్నికలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ ఎద్దు సభా ప్రాంగణంలోకి దూసుకొచ్చింది. సోమవారం గుజరాత్‌లోని మెహసానాలో సీఎం అశోక్ గెహ్లాట్ ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో సభలో ప్రసంగించారు. ఈ క్రమంలో ఎద్దు వచ్చింది. ఈ ఘటనపై అశోక్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ మీటింగ్‌ ఎప్పుడు జరిగినా ఎద్దును, ఆవును వదిలడం చిన్నప్పటి నుంచి చూస్తున్నానని బీజేపీ ని ఉద్దేశించి అన్నారు. సభకు భంగం కలిగించేందుకే ఎద్దును వదిలారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సమావేశాలకు భంగం కలిగించేందుకు బీజేపీ ఇలాంటి వ్యూహాలు రచిస్తోందని మండిపడ్డారు. సభా ప్రాంగణంలోకి ఎద్దు ప్రవేశించడంతో గందరగోళం నెలకొంది. దీంతో ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని అశోక్ గెహ్లాట్ కోరారు. దానంతట అదే బయటకు వెళ్లిపోతుందని, కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. ఎద్దు ఆకస్మాత్తుగా సభా ప్రాంగణంలోకి ప్రవేశించింది. దానిని నిలువరించేందుకు ప్రజలు ప్రయత్నాలు చేయడాన్ని చూడవచ్చు. కాంగ్రెస్ సమావేశాలకు భంగం కలిగించేందుకు బీజేపీ నేతలు తరచుగా ఇలాంటి పనులు చేస్తున్నారని అశోక్ గెహ్లాట్ విమర్శించడాన్ని గమనించవచ్చు. కాగా.. గుజరాత్‌లో డిసెంబర్ 1, డిసెంబర్ 5 తేదీల్లో రెండు విడతల్లో ఓటింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు ఎన్నికల ప్రచారంలో తిరుగులేకుండా శ్రమిస్తున్నాయి. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ చెబుతుండగా.. 27 ఏళ్ల పోరాటం తర్వాత ఈసారి ‘లాటరీ’ పడుతుందని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అంతే కాకుండా విజయం సాధించి తీరతామని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ధీమాగా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..