GATE 2023 ఎగ్జామినేషన్ షెడ్యూల్ విడుదల.. ఏ రోజున ఏ పరీక్షంటే..
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)- 2023 ఎగ్జామినేషన్ షెడ్యూల్‌ను ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో..

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)- 2023 ఎగ్జామినేషన్ షెడ్యూల్‌ను ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో గేట్ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరనుంది. ఈ నాలుగు రోజుల్లో రెండు సెషన్ల చొప్పున పరీక్ష జరుగుతుంది.
ఏయే రోజున ఏ పరీక్షంటే..
- ఫిబ్రవరి 4వ తేదీ, 2023న.. ఉదయం 9:30 గంటల నుంచి మద్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే మొదటి సెషన్‌లో సీఎస్ పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగే రెండో సెషన్‌లో ఏఆర్, ఎమ్‌ఈ పరీక్ష జరుగుతుంది.
- ఫిబ్రవరి 5వ తేదీ, 2023న.. ఉదయం 9:30 గంటల నుంచి మద్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే మొదటి సెషన్‌లో ఈఈ, ఈఎస్, ఎక్స్‌హెచ్ పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగే రెండో సెషన్‌లో బీఎమ్, సీవై, ఈసీ పరీక్ష జరుగుతుంది.
- ఫిబ్రవరి 11వ తేదీ, 2023న.. ఉదయం 9:30 గంటల నుంచి మద్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే మొదటి సెషన్‌లో జీజీ, ఐఎన్, ఎమ్ఏ, పీఈ, ఎక్స్‌ఈ, ఎక్స్ఎల్ పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగే రెండో సెషన్‌లో ఎఈ, ఎజీ, బీటీ, సీహెచ్, ఈవై, జీహెచ్, ఎమ్‌టీ, ఎన్‌ఎమ్, పీహెచ్, పీఐ, టీఎఫ్ పరీక్ష జరుగుతుంది.
- ఫిబ్రవరి 12వ తేదీ, 2023న.. ఉదయం 9:30 గంటల నుంచి మద్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే మొదటి సెషన్‌లో సీఈ1, సీటీ పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగే రెండో సెషన్‌లో సీఈ2, ఎమ్ఎన్ పరీక్ష జరుగుతుంది.
- ఫిబ్రవరి 15న క్యాండిడేట్స్ రెస్పాన్సెస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
- ఫిబ్రవరి 21వ తేదీన ఆన్సర్ ‘కీ’ వెబ్‌సైల్‌లో విడుదల చేస్తారు.
- ఫిబ్రవరి 22వ తేదీ నుంచి 25 వరకు ఆన్సర్ ‘కీ’పై అభ్యంతరాలు లేవనెత్తవచ్చు.
- మార్చి 16న గేట్-2023 ఫలితాల ప్రకటన.
- మార్చి 21 నుంచి గేట్-2023 స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థుల ప్రతిస్పందనలు ఫిబ్రవరి 15, 2023న పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి, అయితే జవాబు కీ ఫిబ్రవరి 21, 2023న అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారులు సమాధానాల కీకి సవాళ్లను ఫిబ్రవరి 22 నుండి 25, 2023 వరకు సమర్పించవచ్చు. ఫలితాలు ప్రకటించబడతాయి మార్చి 16, 2023 మరియు స్కోర్‌కార్డ్ మార్చి 21, 2023 నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది.



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.




