TS Tenth Exam Fee: ప్రైవేటు స్కూళ్ల బరితెగింపు.. పదో తరగతి పరీక్షకు పదింతల ఫీజు వసూళ్లు.. అసలు ఫీజు ఎంతంటే?

తెలంగాణలో 2022-23 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు పరీక్ష ఫీజులు చెల్లించవల్సిందిగా ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించింది. ఐతే కొన్ని కొన్ని ప్రైవేటు స్కూళ్లు మాత్రం ఇష్టారాజ్యంగా..

TS Tenth Exam Fee: ప్రైవేటు స్కూళ్ల బరితెగింపు.. పదో తరగతి పరీక్షకు పదింతల ఫీజు వసూళ్లు.. అసలు ఫీజు ఎంతంటే?
Telangana SSC Exam Fee
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 29, 2022 | 11:01 AM

తెలంగాణలో 2022-23 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు పరీక్ష ఫీజులు చెల్లించవల్సిందిగా ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించింది. దీని ప్రకారం నవంబర్‌ 24వ తేదీ వరకు ఎటువంటి ఆలస్య రుసుములేకుండా రూ.125లు ఫీజు చెల్లించే గడువు ముగిసింది. ఇక రూ.50ల ఆలస్య రూసుముతో డిసెంబర్‌ 5 వరకు, రూ.200ల ఆలస్య రూసుముతో డిసెంబర్‌ 15 వరకు, రూ.500ల ఆలస్య రూసుముతో డిసెంబర్‌ 29 వరకు ఫీజులు చెల్లించుకోవచ్చు. నిరంతరం ఏదో ఒక రూపంలో ఫీజులు వసూలు చేసే ప్రైవేటు స్కూళ్ల యాజమన్యాలు, పరీక్ష ఫీజుల రూపేనా పదింతల ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో పరీక్ష ఫీజుతో కలుపుకొని రూ.500 నుంచి రూ.1500 వరకు కొన్ని ప్రైవేటు స్కూళ్లు వసూలు చేశాయి. అధిక ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. అపరాధ రుసుము లేకుండా గడువు ముగిసిపోయింది. ఇప్పుడు రూ.50 కలుపుకొని రూ.175ల ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. కానీ ప్రైవేటు స్కూళ్లలో రూ.500 వసూలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలలైతే దాదాపు రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు.

పరీక్ష ఫీజుల విషయంలో ప్రైవేటు యాజమాన్యాలపై విద్యాశాఖ ఆజమాయిషీ కొరవడటంతో బరితెగింపు చర్యలకు పూనుకుంటున్నారు. అదనపు వసూళ్లు గతంలో ఉన్నప్పటికీ కరోనా కారణంగా అడ్డుకట్ట పడింది. ఈసారి ప్రత్యక్షంగా తరగతులు నిర్వహిస్తుండటంతో వసూళ్ల దందాకు తెరలేపాయి. స్కూలు ఫీజులను సహజంగా ప్రతి ఏడాది రెండు, మూడు విడతల్లో కట్టించుకుంటాయి. ఐతే పదో తరగతిలో ఉన్న విద్యార్థులందరూ డిసెంబరు 15లోగా చెల్లించాలని.. లేకపోతే పరీక్ష ఫీజులను విద్యాశాఖకు చెల్లించేది లేదని, హాలు టికెట్లు జారీ కావని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ విషయంలో విద్యాశాఖ తగిప చర్యలు తీసుకోవల్సిందిగా విద్యార్ధుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.