CSIR-CBRI Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండా ఎంపిక..

సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. 66 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

CSIR-CBRI Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండా ఎంపిక..
CSIR-CBRI Roorkee
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 29, 2022 | 8:25 AM

సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. 66 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌/మెకానిక్స్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌, జియాలజీ/అప్లైడ్‌ జియాలజీ/బయో-కెమిస్ట్రీ/కెమిస్ట్రీ/ఇన్‌ఆర్గానిక్‌ కెమిస్ట్రీ/ఫిజిక్స్‌ స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ, బీఆర్క్‌, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్‌ 5, 6, 7, 8 తేదీల్లో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. అర్హత సాధించిన వారికి పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

అడ్రస్:

Director, CSIR-CBRI, Roorkee.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.