Bengaluru: 205 కిలోల ఉల్లి అక్షరాల 8 రూపాయలు మాత్రమే.. ఈ రైతన్నకు వచ్చిన కష్టం మరెవ్వరికీ రావొద్దు!

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించబోతే ఈ రైతుకు కన్నీళ్లు మిగిలాయి. కాకిలెక్కలు వేసి ఓ ఉల్లిరైతును ఎంత మోసం చేశారో తెలిస్తే మనసు చలించిపోతుంది. వివరాల్లోకెళ్తే..

Bengaluru: 205 కిలోల ఉల్లి అక్షరాల 8 రూపాయలు మాత్రమే.. ఈ రైతన్నకు వచ్చిన కష్టం మరెవ్వరికీ రావొద్దు!
25 paise per kg onion in Bengaluru
Follow us

|

Updated on: Nov 28, 2022 | 1:41 PM

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించబోతే ఈ రైతుకు కన్నీళ్లు మిగిలాయి. కాకిలెక్కలు వేసి ఓ ఉల్లిరైతును ఎంత మోసం చేశారో తెలిస్తే మనసు చలించిపోతుంది. వివరాల్లోకెళ్తే.. బెంగళూరులోని గడగ్‌ జిల్లా, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పావాడెప్ప హళ్లికేరికి అనే రైతు యశ్వంత్‌పూర్ మార్కెట్‌లో కు చెందిన ఓ రైతు 205 కిలోల ఉల్లిపాయలు విక్రయించగా రూ.8.36 మాత్రమే దక్కాయి. అంటే కేజీ ఉల్లి కేవలం రూ.25 పైసలకు కొన్నాడన్నమాట. పంటను మార్కెట్‌కు తరలించడానికే సదరు రైతు రూ.25 వేలకు పైగా ఖర్చు చేశాడు. ఇక పంట పెట్టుబడి, రవాణా ఖర్చులు తల్చుకుని రైతు కుమిలిపోయాడు. తనలాగే ఇతర రైతులు కూడా తమ పంటను అమ్ముకుని నష్టపోవద్దని, దయచేసి బెంగళూరులో విక్రయించవద్దని.. ఉల్లి విక్రయించినప్పుడు తనకు ఇచ్చిన రసీదును సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ రసీదు నెట్టింట వైరల్‌ అవుతోంది.

రసీదులో ఉన్న లెక్కల ప్రకారం.. బిల్లు జారీ చేసిన హోల్‌సేల్ వ్యాపారి ఉల్లి ధర 52 కేజీలకు రూ.104లు, 153 కేజీలకు రూ.306లుగా నిర్ణయించాడు. హమాలీ కూలీ రూ.24, రవాణాకు రూ.377.64లు వేశాడు. ఖర్చులు మినహాయించగా రైతు చేతిలో రూ.8.36లు పెట్టాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ రైతు తన పరిస్థితిని సోషల్‌ మీడియా ద్వారా ఇతర రైతులకు తెలియజేశాడు. తనలాగే మిగతా రైతులు నష్టపోకూడదని హెచ్చరించాడు. కాగా గడగ్‌కు చెందిన దాదాపు 50 మంది రైతులు, దాదాపు 415 కిలోమీటర్లు ఉల్లిని రవాణా చేసి యశ్వంత్‌పూర్ మార్కెట్‌కు తరగలించారు. గత కొద్దిరోజుల క్రితం క్వింటా ధర రూ.500లు పలికింది. సదరు మార్కెట్లో మత్రం ధర రూ.200ల కింద తీసుకోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీస మద్ధతు ధర ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. సరైన నిర్ణయం తీసుకోకపోతే డిసెంబర్‌ మొదటి వారంలో నిరసనలు చేపడతామన్నారు. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొద్దొగొప్పో మిగిలిన ఉల్లిపాయలు మార్కెట్‌కు తరలిస్తే ఇదెక్కడి అన్యాయం అంటూ గుండెలు బాదుకుంటున్నారు. దీనిపై ఆ రాష్ట్ర సర్కార్‌ ఏ నిర్ణయం తీసుకుంటుదో వేచి చూడవల్సిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.