- Telugu News Photo Gallery Science photos Science Facts: Do you know why crooked lines are made on the water bottle?
Science Facts: వాటర్ బాటిళ్లపై ఆ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక సైన్స్ రహస్యం ఇదే..
ఈ రోజుల్లో వాటర్ బాటిళ్లను వాడని వారుండరంటే అతిశయోక్తికాదు. సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లడానికి అనుగుణమైన ప్లాస్టిక్, స్టీల్, ఇతర లోహల్లో వాటర్ బాటిళ్లు దర్శనమిస్తుంటాయి. ఐతే మీరెప్పుడైనా గమనించారా..? ప్రతి వాటర్ బాటిల్‌పై కొన్ని చారలు..
Updated on: Nov 28, 2022 | 12:22 PM

ఈ రోజుల్లో వాటర్ బాటిళ్లను వాడని వారుండరంటే అతిశయోక్తికాదు. సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లడానికి అనుగుణమైన ప్లాస్టిక్, స్టీల్, ఇతర లోహల్లో వాటర్ బాటిళ్లు దర్శనమిస్తుంటాయి. ఐతే మీరెప్పుడైనా గమనించారా..?

ప్రతి వాటర్ బాటిల్‌పై కొన్ని చారలు లేదా గీతలు ఉంటాయి. వాటర్ బాటిల్స్‌పై ఈ లైన్‌లు ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కో బ్రాండ్ బాటిల్‌కు ఒక్కో విధమైన గీతలుంటాయి. ఇలా ఎందుకు ఉంటాయో.. దీని వెనుక సైన్స్ ఏంటో తెలుసుకుందాం..

వాటర్ బాటిళ్లపై ఉండే ఈ లైన్లు స్టైల్ కోసం, డిజైన్ కోసం అనుకుంటే పొరబడ్డట్టే. ప్రధాన కారణం ఏమంటే.. వాటర్ బాటిళ్లను గట్టి ప్లాస్టిక్‌తో తయారు చేయరు. వీటిని తయారు చేయడానికి హార్డ్ ప్లాస్టిక్‌కు బదులుగా మృదువైన ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తారు.

ఇటువంటి ప్లాస్లిక్‌తో తయారు చేసిన వాటర్ బాటిళ్లపై లైన్లు లేకపోతే.. బాటిల్ వంగిపోయి, విరిగిపోతాయి.

బాటిళ్లపై ఈ లైన్లు ఉండటానికి మరో కారణం కూడా ఉంది. బాటిల్ పట్టుకుని నీళ్లు తాగేటప్పుడు.. పట్టుకోవడానికి గ్రిప్ వస్తుంది. తద్వారా బాటిల్ చేతిలో నుంచి జారిపోకుండా, చేతితో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.





























