Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengaluru: ‘కొంప తీసి ఇళ్ల ఓనర్లకు పిచ్చెక్కలేదు కదా! ఈ షరతులేంది సామీ..’ బెంగళూరు లో అద్దె కష్టాలు

రాను రానూ..బెంగళూరు వంటి నగరాల్లో అద్దె ఇల్లు దొరకడం సవాలుగా మారుతోంది. ఇళ్ల యజమానులు పెట్టే వింత కండిషన్లు వింటే పిచ్చెక్కినంత పనౌతుంది. తాజాగా ప్రియాన్ష్‌ జైన్‌ అనే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హౌస్‌ బ్రోకర్‌ను..

Bengaluru: 'కొంప తీసి ఇళ్ల ఓనర్లకు పిచ్చెక్కలేదు కదా! ఈ షరతులేంది సామీ..' బెంగళూరు లో అద్దె కష్టాలు
Bengaluru Landlords Demand IIT Degrees
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 28, 2022 | 2:15 PM

రాను రానూ..బెంగళూరు వంటి నగరాల్లో అద్దె ఇల్లు దొరకడం సవాలుగా మారుతోంది. ఇళ్ల యజమానులు పెట్టే వింత కండిషన్లు వింటే పిచ్చెక్కినంత పనౌతుంది. తాజాగా ప్రియాన్ష్‌ జైన్‌ అనే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హౌస్‌ బ్రోకర్‌ను ఇల్లుకావాలని సంప్రదించాడు. ఐతే సదరు బ్రోకర్‌గారు అడుగుతున్న వివరాల లిస్టు చూడగానే కళ్లు బైర్లుకమ్మాయట. బ్రోకర్‌ అడిగిన ప్రశ్నలకు.. తాను అట్లాసియన్‌లో పనిచేస్తున్నానని, పూర్తిగా శాఖాహారినని జైన్‌ చెప్పాడు. ఆ తర్వాత మీరు ఎక్కడ చదివారు అనే ప్రశ్నకు.. నేను వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదివానని జైన్‌ చెప్పాడు. అంతేజజ మీకు ఇల్లు ఇవ్వడం కుదరని వెనుదిరిగాడు. అయోమయంలోపడ్డ జైన్ ఎందుకని ప్రశ్నించగా.. కేవలం IIT, ISB, IIM, CA గ్రాడ్యుయేట్లకు మాత్రమే ఇక్కడి ఓనర్లు ఇల్లు ఇస్తారు. శాలరీ స్లిప్పులు, లింకెడిన్ ప్రొఫైళ్లు, గర్ల్ ఫ్రెండ్ల వివరాలు చెపితేగానీ ఇల్లు అద్దెకి దొరకదని చెప్పాడు. జైన్ మాత్రమే కాదు.. ప్రస్తుతం బెంగళూరులోని అనేక మంది పరిస్థితి ఇదే.

తాను ఎదుర్కొన్న అనుభవాన్ని ప్రియాంష్ జైన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ ట్వీట్‌పై స్పందించిన పలువురు తాము కూడా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నట్లు కామెంట్‌ సెక్షన్‌లో తెలిపారు.

ఇవి కూడా చదవండి

బెంగళూరులో ఓ అద్దె ఇంటిని సంప్రదిస్తే.. నా లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌, గర్ల్ ఫ్రెండ్స్‌ వివరాలు అడిగారు. ఇళ్ల యజమానుల పిచ్చి పీక్‌కి చేరినట్లుందని అర్నవ్ గుప్త అనే ఇంజనీర్‌ చెప్పుకొచ్చాడు. గతంలో ఉన్న ఇంటికి సంబంధించి లీవింగ్ సర్టిఫికేట్‌ అడిగినట్లు మరొకరు తెలిపారు. దీంతో బెంగళూరు ఇంటి ఓనర్లపై టెనెంట్లు గుర్రు మంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.