Shraddha Murder Case: శ్రద్దా కేసులో కీలక మలుపు.. మరో గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇచ్చిన శ్రద్దా ఉంగరాన్ని, హత్యాఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు..!

అంతేకాదు శ్రద్ధకు చెందిన ఉంగరాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. శ్రద్ధను చంపిన తర్వాత, అఫ్తాబ్ ఈ ఉంగరాన్ని వృత్తిరీత్యా సైకాలజిస్ట్ అయిన తన మరో గర్ల్ ఫ్రెండ్ కు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. 

Shraddha Murder Case: శ్రద్దా కేసులో కీలక మలుపు.. మరో గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇచ్చిన శ్రద్దా ఉంగరాన్ని, హత్యాఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు..!
Shraddha Walker
Follow us

|

Updated on: Nov 28, 2022 | 5:29 PM

ఢిల్లీలోని మెహ్రౌలీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక సాక్ష్యం దొరికినట్లు తెలుస్తోంది.  ఢిల్లీ పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు శ్రద్ధా హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయుధం రికవరీతో పాటు..  పోలీసులు ఈ ఆయుధాన్ని దర్యాప్తు కోసం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL)కి పంపారు. అంతేకాదు శ్రద్ధకు చెందిన ఉంగరాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. శ్రద్ధను చంపిన తర్వాత, అఫ్తాబ్ ఈ ఉంగరాన్ని వృత్తిరీత్యా సైకాలజిస్ట్ అయిన తన మరో గర్ల్ ఫ్రెండ్ కు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

శ్రద్దా హత్య కేసు వెలుగులోకి వచ్చి నెలకు పైగా గడిచిపోయింది.. అయితే నిందితుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా ప్రియుడు..  అఫ్తాబ్ .. తాను శ్రద్దాను హత్య చేసిన తర్వాత 35 ముక్కలుగా నరికినట్లు విచారణలో చెప్పాడు. ఈ దారుణ మారణకాండ తర్వాత అఫ్తాబ్ ప్రతిరోజూ కొత్త విషయాలు వెల్లడిస్తున్నాడు. అయితే అతని మాటలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అఫ్తాబ్‌ ఇస్తున్న సమాచారం.. తమను అయోమయానికి గురిచేసి దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు భావించారు. దీంతో పోలీసులు అఫ్తాబ్ కి నార్కో , పాలిగ్రఫీ పరీక్షల నిమిత్తం అనుమతి కోరారు. కోర్టు నుంచి అనుమతి లభించిన తర్వాత అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష ప్రక్రియ కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ కేసులో ముఖ్యమైన ఆధారం పోలీసులకు లభించింది.

నేడు నాలుగో దశ పాలిగ్రాఫ్ పరీక్ష శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు నాలుగో దశ పాలిగ్రాఫ్ పరీక్ష నేడు నిర్వహించారు. డిసెంబర్‌ 5న నార్కో టెస్ట్‌ చేయవచ్చు. ఈ మేరకు ఆదివారం వర్గాలు వెల్లడించాయి. రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)లో సోమ, మంగళవారాల్లో రెండు సెషన్ల పాలిగ్రాఫ్ పరీక్ష ఉంటుందని తెలిపారు. పూనావాలా ఇప్పటికే మూడు సెషన్ల పాలిగ్రాఫ్ పరీక్షను పూర్తి చేశారు. పాలిగ్రాఫ్ పరీక్షను లై డిటెక్టర్ పరీక్ష అని కూడా అంటారు. పాలిగ్రాఫ్ పరీక్షలో, రక్తపోటు, పల్స్ , శ్వాస రేటు వంటి శారీరక లక్షణాలు నమోదు చేయబడతాయి. నిందితుడు నిజం చెబుతున్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఈ డేటా ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

గొంతుకోసి హత్య చేసి ఆపై నరికి చంపిన అఫ్తాబ్: ముంబై నివాసి శ్రద్ధా వాకర్ (27)ని ఆమె లివ్ -ఇన్ పార్ట్‌నర్ పూనావాలా గొంతు కోసి హత్య చేసి తరువాత..  ఆ మృతదేహాన్ని 35 ముక్కలుగా చేశాడు. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలోని తన ఇంట్లో 300 లీటర్ల రిఫ్రిజిరేటర్‌లో సుమారు మూడు వారాల పాటు ఉంచాడు .  ఆ ముక్కలను వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్కటిగా విసిరాడు. నవంబర్ 12న పోలీసులు పూనావాలాను అరెస్ట్ చేసి పోలీసు కస్టడీకి పంపారు. నవంబర్ 17న అతని కస్టడీని ఐదు రోజుల పాటు పొడిగించారు. మంగళవారం మరో నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి పంపారు. శనివారం ఢిల్లీ కోర్టు పూనావాలాను 13 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్