Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Werewolf Syndrome: తోడేలు రూపంతో యువకుడు.. కొందరు పూజలు.. మరికొందరు రాళ్ల దాడి.. అరుదైన వ్యాధి అంటోన్న వైద్యులు..

చూడగానే భయం కలిగించే తోడేలు లాంటి రూపం ఉన్న యువకుడు మధ్యప్రదేశ్ లో ఉన్నాడు. ఈ యువకుడు 'వేర్‌ఉల్ఫ్‌ సిండ్రోమ్‌' అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తి శరీరం అంతటా విపరీతమైన జుట్టు పెరుగుతుంది. 

Werewolf Syndrome: తోడేలు రూపంతో యువకుడు.. కొందరు పూజలు.. మరికొందరు రాళ్ల దాడి.. అరుదైన వ్యాధి అంటోన్న వైద్యులు..
Mp Man Lalit Patidar
Follow us
Surya Kala

|

Updated on: Nov 25, 2022 | 8:42 AM

శర్మానికి రక్షణ ఇచ్చే వెంట్రుకలు కొంచెం ఎక్కువగా ఉంటేనే ఇబ్బంది పడతారు కొందరు.. మరి అలాంటిది.. తోడేలుకు ఉన్నట్లు.. శరీరంమీద మాత్రమే కాదు.. ముఖంపై కూడా దట్టంగా రోమాలు పెరిగితే.. అటువంటి వ్యక్తి చూడడానికి తోడేలుగా అనిపిస్తే.. ఎవరైనా భయపడతారు.. మరికొందరు హేళన చేస్తారు కూడా.. ఇలా చూడగానే భయం కలిగించే తోడేలు లాంటి రూపం ఉన్న యువకుడు మధ్యప్రదేశ్ లో ఉన్నాడు. ఈ యువకుడు ‘వేర్‌ఉల్ఫ్‌ సిండ్రోమ్‌’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తి శరీరం అంతటా విపరీతమైన జుట్టు పెరుగుతుంది.

రత్లాం జిల్లాలోని నంద్లేటా గ్రామానికి చెందిన లలిత్‌ పాటిదార్‌ అనే 17 ఏళ్ల యువకుడు వేర్‌ఉల్ఫ్‌ సిండ్రోమ్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. తల నుంచి కాలిగోటి వరకు దట్టంగా పెరిగిన వెంట్రుకలతో ఇబ్బంది పడుతున్నాడు. లలిత్ ముఖంపై 5 సెంటీమీటర్ల వరకు దట్టమైన జుట్టు ఉంది. కొందరు హనుమంతుని బాల స్వరూపంగా భావించి పూజించేవారు. మరికొందరు ముఖం చూస్తేనే భయపడేవారు. ఈ వ్యాధి కారణంగా శరీరమంతా వెంట్రుకలు పెరుగుతాయి.

ఎన్నిసార్లు కత్తిరించినా మళ్లీ వెంట్రుకలు వస్తుంటాయి. లలిత్‌ పుట్టినప్పుడే ఒళ్లంతా వెంట్రుకలు ఉండేవి. సాధారణ రోమాలే అనుకొన్న వైద్యులు.. అప్పుడే వాటిని తొలగించారు. ఆరేళ్ళు వచ్చేసరికి లలిత్‌ శరీరం అంతా వెంట్రుకలు పెరిగాయి. దీంతో లలిత్ తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా వేర్‌ఉల్ఫ్‌ సిండ్రోమ్‌ వ్యాధి బారినపడినట్లు చెప్పారు. ఈ వ్యాధి చాలా అరుదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 50 మందికి మాత్రమే ఈ వ్యాధి వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మొదట్లో తన రూపం చూసి పిల్లలు భయపడేవారని, రాళ్లతో కొట్టేవారని లలిత్‌ చెప్పాడు.  అంతేకాదు తనను కోతి మనిషి అని కూడా పిలుస్తారని చెప్పాడు. తాను సాధారణ కుటుంబం నుండి వచ్చాను..  నాన్న వ్యవసాయదారుడని.. తాను ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నానని.. చెప్పాడు. తనకు ఖాళీ ఉంటే    మా నాన్నకు వ్యవసాయ పనులలో సహాయం చేస్తాను” అని లలిత్ చెప్పాడు.

అయితే లలిత్‌ కు   21 ఏళ్లు నిండిన తర్వాత బరోడాకు చెందిన ఓ వైద్యుడు ప్లాస్టిక్ సర్జరీ చేయవచ్చు అని సూచించారు. అందుకే ఇప్పుడు లలిత్ తనకు 21 ఏళ్ల ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం లలిత్ ఫోటోలు,  వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..