AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Group: ఎయిర్ ఇండియా న్యూ రూల్స్.. పురుషులకు అలా.. మహిళా ఉద్యోగులకు ఇలా.. లేదంటే ఇక అంతే!

ఎయిర్‌ ఇండియాకు న్యూ లుక్. అయితే ప్రయాణించే విమానానికి కాదు.. విమానంలో పనిచేసే సిబ్బందికి. ఆ న్యూ లుక్ మీద సంస్థ ఇచ్చిన ఆదేశాలేంటో ఓసారి చూద్దాం. మిగతా ఏవియేషన్ సంస్థలకు, ఎయిర్‌ఇండియాకు కాస్త తేడా ఉంటుంది.

Tata Group: ఎయిర్ ఇండియా న్యూ రూల్స్.. పురుషులకు అలా.. మహిళా ఉద్యోగులకు ఇలా.. లేదంటే ఇక అంతే!
Air India
Shiva Prajapati
|

Updated on: Nov 26, 2022 | 1:18 PM

Share

ఎయిర్‌ ఇండియాకు న్యూ లుక్. అయితే ప్రయాణించే విమానానికి కాదు.. విమానంలో పనిచేసే సిబ్బందికి. ఆ న్యూ లుక్ మీద సంస్థ ఇచ్చిన ఆదేశాలేంటో ఓసారి చూద్దాం. మిగతా ఏవియేషన్ సంస్థలకు, ఎయిర్‌ఇండియాకు కాస్త తేడా ఉంటుంది. ప్రత్యేకించి సిబ్బంది లుక్‌లో. మిగతా సంస్థలకు దీటుగా ఈ సంస్థలోనూ ఉద్యోగులు కనిపించాలన్న కోరికతో ఎయిర్‌ఇండియా కొన్ని 40 పేజీల సర్క్యులర్‌ని సిబ్బందికి మెయిల్ చేసింది. దీని ప్రకారం.. ఫ్లైట్‌లో సిబ్బందిగా ఉన్న పురుషుల జట్టు నెరవడానికి వీల్లేదు. అంటే ఎప్పటికప్పుడు కలర్ వేసుకోవాలి. క్రాఫ్‌ కూడా సన్నగా ఉండాలి. పక్క పాపిడి తీసుకోవాలి. నీట్‌గా జెల్‌ అప్లై చేసుకోవాలి. ఒకవేళ బట్టతల ఉంటే.. నుదురు భాగంగా ఎక్కువగా కనిపించకుండా గుండు చేయించుకోవాలి. అది కూడా ఏరోజుకారోజు షేవ్ చేసుకోవాలి. చేతికి ఒకే ఉంగరం ఉండాలి.. అదీ పెళ్లికి సంబంధించిందై ఉండాలి.

ఇక మహిళలైతే చీరలు, వెస్ట్రన్ డ్రస్‌లు ఏం వేసుకున్నా సరే.. సాక్సులు మాత్రం స్కిన్ కలర్‌లోనే ఉండాలి. స్వెట్టర్లు కంపెనీ ఇచ్చేవి మాత్రమే ధరించాలి. ఇష్టమొచ్చిన మేకప్‌ కిట్స్, కలర్స్ వాడొద్దు. శరీరానికి నప్పే, కంపెనీ అనుమతించిన వాటినే వాడాలి. చెవులకు బంగారం లేదా వజ్రాభరణాలే ఉండాలి. ముత్యాల్లాంటివాటికి, డిజైన్స్‌కి నో పర్మిషన్‌. ఇక ఫిమేల్‌ కాబట్టి.. ఒక్కోచేతికి ఒకటి చొప్పున రెండు ఉంగరాలు మాత్రమే ధరించాలి.

కావాలి అనుకుంటే ఒక సన్నని గాజు వేసుకోవచ్చు. జడ కంపెనీ మార్గ నిర్దేశాలకు అనుగుణంగా ఉండాలి. కొప్పులు పెడితే మరీ కిందకు కాకుండా చూసుకోవాలి. తలకు పెట్టే టిక్‌టాక్ హెయిర్‌పిన్స్‌ నాలుగుకు మించకూడదు. అది కూడా తలకు వెనుక వైపు పెట్టుకోవాలి. కనిపించకుండా సన్నని నెట్ ధరించాలి. ఇవన్నీ ఉదాహరణగా చెప్పే రూల్సే. 40 పేజీల సర్క్యూలర్‌లో ఇలాంటి నియమనిబంధనలు ఇంకెన్నో.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..