AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bombay High Court: “నా భార్యకు ఆ వ్యాధి ఉంది.. విడాకులు ఇప్పించండి”.. ఊహించని తీర్పు ఇచ్చిన హైకోర్టు..

దాంపత్య జీవితంలో భార్యా భర్తలు ఇద్దరూ సమానమే. ఒకరికి కష్టం వస్తే మరొకరు చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. భార్య కష్టాల్లో ఉన్నప్పుడు భర్త.. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు భర్త కంటికి రెప్పలా కాచుకుంటారు. ఏమీ జరగకుండా...

Bombay High Court: నా భార్యకు ఆ వ్యాధి ఉంది.. విడాకులు ఇప్పించండి.. ఊహించని తీర్పు ఇచ్చిన హైకోర్టు..
Bombay Hc
Ganesh Mudavath
|

Updated on: Nov 25, 2022 | 6:43 AM

Share

దాంపత్య జీవితంలో భార్యా భర్తలు ఇద్దరూ సమానమే. ఒకరికి కష్టం వస్తే మరొకరు చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. భార్య కష్టాల్లో ఉన్నప్పుడు భర్త.. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు భర్త కంటికి రెప్పలా కాచుకుంటారు. ఏమీ జరగకుండా కాపాడుకుంటారు. కానీ ఓ భర్త చేసిన పనికి ఏకంగా కోర్టే మొట్టి కాయలు వేసింది. తన భార్య హెచ్ఐవీతో బాధపడుతోందని, ఆమెతో కలిసి ఉండలేనంటూ ఓ వ్యక్తి బాంబే హైకోర్టు ను ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఇదంతా అవాస్తవమని తేల్చింది. అంతే కాకుండా నిరాధార ఆరోపణలు చేసి, భార్యను మానసికంగా వేధించాడని మండిపడింది. విడాకులు ఇప్పించలేమని స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని పుణె నగరానికి చెందిన దంపతులకు 2003 లో వివాహమైంది. కొన్ని రోజులు బాగానే సాగిన వారి కాపురంలో భార్య అనారోగ్యం చిచ్చు పెట్టింది. తన భార్యకు హెచ్ఐవీ సోకిందని, ఆమెతో కలిసి జీవించలేనని విడాకులు కోరుతూ భర్త 2011లో పుణెలోని ఫ్యామిలీ కోర్టును కోరాడు.

తన భార్య విచిత్రంగా ప్రవర్తిస్తోందని, తనతో, తన కుటుంబ సభ్యులతో సరిగ్గా వ్యవహరించడం లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లాడు. సంకుచిత మనస్తత్వం కారణంగా ఇబ్బందులు పడుతున్నానని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఇప్పటికే ఆమెకు అనేక వ్యాధులు సోకాయన్న భర్త.. 2005 లో ఆమెకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలిందని చెప్పాడు. భర్త చేసిన వ్యాఖ్యలను భార్య ఖండించింది. వైద్య పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చినప్పటికీ భర్త, అత్తింటి వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వాదనలు విన్న న్యాయస్థానం వీరి పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో పుణె ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ అదే ఏడాది బాంబే హైకోర్టును ఆశ్రయించాడు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ శర్మిలా దేశ్‌ముఖ్, జస్టిస్‌ నితిన్‌ జమ్‌దార్‌ లతో కూడిన ధర్మాసనం ప్రతివాదికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలినట్లు వైద్య నివేదికను సమర్పించడంలో పిటిషన్‌దారు విఫలమయ్యాడని చెప్పింది. తన భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడని, వ్యాధి లేదని వైద్య పరీక్షల్లో తేలినప్పటికీ ఆమెతో కలిసి ఉండేందుకు నిరాకరించాడని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో భార్యా భర్తలుగా కలిసి జీవించలేమనే వాదనపై దాఖలు చేసిన ఈ విడాకుల పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..