Hyderabad: హమ్మయ్య.. భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్ బ్రిడ్జ్..

హైదారాబాద్ వాసులకు గుడ్ న్యూస్ వచ్చింది. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు GHMC మరో ఫ్లై ఓవర్ బ్రిడ్జి సిద్ధం చేసింది. దీన్ని మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారు.

Hyderabad: హమ్మయ్య.. భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్ బ్రిడ్జ్..
Shilpa Layout Flyover Bridge
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 24, 2022 | 8:13 PM

గ్రేటర్ హైదరాబాద్ గుడ్ న్యూస్ వచ్చింది. నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రాబోతుంది.  శిల్పా లే ఔట్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర మునిసిపల్ పట్టణాభివృద్ధి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా వాహనాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జిహెచ్ఎంసి విశేష కృషి చేస్తున్నది. ప్రజల అవసరాలను ముందుగా అంచనా వేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. ముఖ్యంగా రవాణా సౌకర్యం, వాహన కాలుష్యాన్ని తగ్గించడం, సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగు పరిచి వాహనదారులు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి సకాలంలో చేరడం కోసం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (SRDP) ప్రోగ్రామ్ ద్వారా చేపట్టిన పలు పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి రావడం మూలంగా ప్రజల ఇబ్బందులు తొలగిపోతున్నాయి.

రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.ఆర్ ముందుచూపుతో గ్రేటర్ హైదరాబాద్ ను విశ్వ నగరంగా అభివృద్ధి చేసి మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఐటీ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్ లో గచ్చిబౌలి, మాదాపూర్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో గణనీయమైన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత రవాణా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు ఎస్.ఆర్.డి.పి ద్వారా కారిడార్లు, గ్రేడ్ సెపరేట్, అండర్ పాస్‌లు, ఆర్ఓబిలు లాంటి రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ముందకు వెళ్తున్నారు.

అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఔటర్ రింగు రోడ్డు ద్వారా గచ్చిబౌలి వరకు ఎలాంటి సమస్యలు లేకుండా నేరుగా చేరుకున్నప్పటికీ అక్కడ నుండి ఇతర ప్రాంతాలకు సులభతరంగా వెళ్లేందుకు ముఖ్యంగా శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం వలన ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వెళ్లేందుకు సులభతరం అవుతుంది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట నుండి గచ్చిబౌలి మీదుగా పఠాన్ చేరు, కోకాపేట్, నార్సింగ్ తో పాటుగా అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లేందుకు సులభతరం అవుతుంది.

ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 17వ ఫ్లైఓవర్ బ్రిడ్జి

ఓ.ఆర్.ఆర్ నుండి గతంలో ఉన్న గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై నుండి శిల్పా లే ఔట్ వరకు అక్కడ నుండి ఓ.ఆర్.ఆర్ వరకు మరో వైపు రెండు వైపులా కలుపుకుని మొత్తం 956 మీటర్ల పొడవు 16.60 మీటర్ల వెడల్పు గల ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టారు. అప్ ర్యాంపు ఓ.ఆర్.ఆర్ నుండి శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ వరకు 456.64 మీటర్ల వెడల్పు, శిల్పా లే అవుట్ నుండి ఓ.ఆర్.ఆర్ వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 399.952 మీటర్ల వెడల్పుతో రెండు ఫ్లైఓవర్ లను చేపట్టారు. సర్వీస్ రోడ్డుగా ఉపయోగించేబడే గచ్చిబౌలి నుండి మైండ్ స్పేస్ వరకు 473 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో అప్ ర్యాంపు ఫ్లైఓవర్ ను చేపట్టారు. అదే విధంగా మైండ్ స్పేస్ నుండి గచ్చిబౌలి వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 522 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో చేపట్టారు.

ఈ శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ వలన ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, హై టెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. గచ్చిబౌలి జంక్షన్ ట్రాఫిక్ కు సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. హెచ్.కె.సి, మీనాక్షి టవర్ ప్రాంతంలో అభివృద్ధి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు స్టేజి 2లో భాగంగా ఓ.ఆర్.ఆర్ నుండి కొండాపూర్ వరకు చేపట్టే ఫ్లై ఓవర్ పనులు కొనసాగుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం