TSPSC: పుస్తకాలతో కుస్తీలు పట్టాల్సిందే.. పట్టు బడితే జాబ్ కొట్టాల్సిందే.. ఎందుకంటే..
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. త్వరలోనే గ్రూప్-,2 3, 4 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. ఇటీవలే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి అయ్యాయి. గ్రూప్-2లో కొత్తగా...
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. త్వరలోనే గ్రూప్-,2 3, 4 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. ఇటీవలే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి అయ్యాయి. గ్రూప్-2లో కొత్తగా ఆరు రకాల పోస్టులు, గ్రూప్-3 లో రెండు రకాల పోస్టులు, గ్రూప్-4లో నాలుగు రకాల పోస్టులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలో జారీ చేసిన 55 జీవోలో సవరణలు చేశారు. తాజా నిర్ణయంతో గ్రూప్-2, 3, 4 లో పోస్టుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. గ్రూప్-2లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిష్ సర్వీస్ కు చెందిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులతో పాటు ఇతర శాఖలకు చెందిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. గ్రూప్-3లో గిరిజ సంక్షేమ శాఖ అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్.. గ్రూప్-4లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ జువైనల్ సర్వీసెస్ సూపర్‌వైజర్ (మేల్) (జువైనల్ సర్వీసెస్, డబ్య్లూసీడీ అండ్ ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్), మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్, మ్యాట్రన్ (కమిషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్) పోస్టులను అదనంగా చేర్చారు.
కాగా.. తెలంగాణలో అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష ఫైనల్ కీ తో పాటు, ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్ షీట్‌లను టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో ఉంచింది. గ్రూప్ 1 ఫలితాలు నవంబర్ మూడో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. గ్రూప్ – 1 ఫైనల్ కీలో మొత్తం 5 ప్రశ్నలను డిలీట్ చేయగా.. రెండు ప్రశ్నలకు 1 కంటే రెండు సమాధానాలు ఉన్నట్లు గుర్తించారు. 503 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు.
మరోవైపు.. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి శారీరక సామర్థ్య పరీక్షల ముహూర్తం ఖరారైంది. ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ) లను డిసెంబరు మొదటి వారంలో నిర్వహించేందుకు పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాలను ఎంపిక చేసింది. 25 రోజుల్లో ఈ పరీక్షలు పూర్తి చేయాలనే లక్ష్యంతో TSLPRB కసరత్తు చేస్తోంది. మెయిన్స్ రాతపరీక్ష నిర్వహణ సులువేనని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. శారీరక సామర్థ్య పరీక్షలకు ఎంపిక చేసిన మైదానాల్లో ఇంటర్‌నెట్ అందుబాటులో ఉంచడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం