AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: యువకుడిపై నలుగురు యువతుల గ్యాంగ్ రేప్.. మత్తు మందు చల్లి, కిడ్నాప్.. అంతే కాకుండా..

ఇప్పటి వ‌ర‌కు యువ‌తులు, మ‌హిళ‌ల‌ు, చిన్నారులపై అత్యాచారాలు జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు మనం చూస్తూనే ఉన్నాం. పూట‌కొక‌చోట‌, రాత్రి , పగలు అనే తేడా లేకుండా మృగాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వీటిని అరికట్టేందుకు...

Punjab: యువకుడిపై నలుగురు యువతుల గ్యాంగ్ రేప్.. మత్తు మందు చల్లి, కిడ్నాప్.. అంతే కాకుండా..
Man Harassment
Ganesh Mudavath
|

Updated on: Nov 25, 2022 | 6:47 AM

Share

ఇప్పటి వ‌ర‌కు యువ‌తులు, మ‌హిళ‌ల‌ు, చిన్నారులపై అత్యాచారాలు జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు మనం చూస్తూనే ఉన్నాం. పూట‌కొక‌చోట‌, రాత్రి , పగలు అనే తేడా లేకుండా మృగాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వీటిని అరికట్టేందుకు పోలీసులు, అధికారులు ఎంత ప్రయత్నించినా అడ్డుకట్ట పడటం లేదు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా యథాలాపంగా జరగాల్సినవి జరిగిపోతున్నాయి. కానీ ప్రస్తుతం ఓ వెరైటీ కేసు వెలుగులోకి వచ్చింది. నలుగురు యువతులు కలిసి ఓ యువకుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు మందు చల్లి, కిడ్నాప్ చేసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. అనంతరం రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావించిన బాధితుడు.. ఓ వీడియో రిలీజ్ చేశాడు. తనపై జరిగిన దురాగతాన్ని వివరించాడు. ప్రస్తుతం ఈ చిత్రమైన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం కలిగిస్తోంది. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్​నగరంలో ఈ ఘటన జరిగింది.

జలంధర్​నగరంలోని కపుర్తలా రోడ్డులో ఓ యువకుడు పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో అక్కడికి ఓ కారులో వచ్చిన అమ్మాయిలు.. ఆ యువకుడిపై మత్తుమందు చల్లారు. అతడిని కిడ్నాప్​ చేశారు. ఆ తర్వాత ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లారు. పూటుగా మద్యం తాగిన ఆ యువతులు ఆ యువకుడిని కూడా మద్యం తాగాలని బలవంతం చేశారు. అనంతరం అతడిని తాళ్లతో కట్టి, అత్యాచారం చేశారు. తెల్లవారు జామున 3 గంటలకు అదే కారులో యువకుడిని ఎక్కించుకుని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.

ఉదయం స్పృహ వచ్చాక ఆ యువకుడు తనపై అత్యాచారం జరిగిందని గుర్తించాడు. వెంటనే ఓ వీడియో విడుదల చేశాడు. తనపై అత్యాచారం జరిగిందని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన పరువు పోతుందని, అందుకే కంప్లైంట్ ఇవ్వలేదని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. వీడియో వైరల్ గా మారడంతో జలంధర్​డీసీపీ జగన్మోహన్​సింగ్​స్పందించారు. తమ వద్దకు ఇలాంటి కేసు ఏదీ రాలేదని, ఏ పోలీస్​స్టేషన్​లోనూ ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌