PM Modi: ప్రధాని పర్యటనలో భద్రతా లోపం.. అధికారుల అప్రమత్తత.. డ్రోన్ కూల్చివేత..

దేశ ప్రధాని నరేంద్ర మోదీ భద్రతలో లోపభూయిష్టమైన అంశం గురువారం వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని బావ్లా బహిరంగ సభలో ప్రసంగించేందుకు ప్రధాని మోదీ వెళ్లారు. ఈ సమయంలో ఆయన...

PM Modi: ప్రధాని పర్యటనలో భద్రతా లోపం.. అధికారుల అప్రమత్తత.. డ్రోన్ కూల్చివేత..
Pm Modi
Follow us

|

Updated on: Nov 25, 2022 | 6:55 AM

దేశ ప్రధాని నరేంద్ర మోదీ భద్రతలో లోపభూయిష్టమైన అంశం గురువారం వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని బావ్లా బహిరంగ సభలో ప్రసంగించేందుకు ప్రధాని మోదీ వెళ్లారు. ఈ సమయంలో ఆయన భద్రతలో పెద్ద లోపం ఏర్పడింది. ఓ ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ మీటింగ్ ప్లేస్ దగ్గర వీడియో రికార్డింగ్ కోసం డ్రోన్ ఎగరేశాడు. పోలీసులు, ఎస్పీజీని చూడగానే భద్రతా సిబ్బంది పరుగులు తీశారు. తక్షణమే అప్రమత్తమైన ఎస్పీజీ డ్రోన్‌ను కూల్చివేసింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కేశ్ కలు భాయ్, నికుల్ రమేష్ భాయ్ పర్మార్, రాజేష్ ప్రజాపతి ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డ్రోన్‌లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవు. అయితే.. ప్రధాని పర్యటన సందర్భంగా ‘నో డ్రోన్ ఫ్లై జోన్’ నిబంధనను ఉల్లంఘించినందుకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

అహ్మదాబాద్ రూరల్‌కు చెందిన పోలీసు కానిస్టేబుల్ అనూప్ సింగ్ భరత్‌సంగ్, సభా మైదానం సమీపంలోని ప్రధాన రహదారి నుంచి మైక్రో డ్రోన్‌లను నడుపుతున్న కొంతమంది వ్యక్తులను గుర్తించారు. డ్రోన్ డ్రైవర్లను పట్టుకుని డ్రోన్‌ను కిందకు దించాలని కోరారు. ముగ్గురు వ్యక్తులు డ్రోన్‌ను కిందకు దించారు. బీడీడీఎస్ బృందం వెంటనే డ్రోన్‌ను తనిఖీ చేసింది. డ్రోన్ కేవలం చిత్రీకరణ కోసం మాత్రమేనని ఎటువంటి పేలుడు పదార్ధాలు లేవని గుర్తించారు. దీంతో డ్రోన్ ను కిందకు దించి అనుమానాస్పదంగా వ్యవహరించడంతో డ్రోన్ ను కూల్చివేశారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు.. ప్రధాని మోడీ శుక్రవారం నాడు పూర్వపు అహోం రాజ్యానికి చెందిన జనరల్ లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతి కార్యక్రమాల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. నవంబర్ 25న ఉదయం 11 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో జరిగే ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తారని పీఎంవో తెలిపింది. ఈ వేడుకలను ఈ ఏడాది ఫిబ్రవరిలో అస్సాంలోని జోర్హాట్‌లో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు. లచిత్ బోర్ఫుకాన్ గతంలో అస్సాంలోని అహోం రాజ్యంలో జనరల్. అతను 1671 సరైఘాట్ యుద్ధంలో అతని నాయకత్వానికి గుర్తింపు పొందారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం