Ice Cream Video: ఐస్‌ క్రీం కోసం కోపంతో ఊగిపోయిన చిన్నారి.. ఆటపట్టిస్తే ఇలాగే ఉంటుంది మరి..

ఐస్‌క్రీం అంటే ఇష్టపడనివారుండరు. చిన్నా, పెద్దా, ఆడా, మగా అనే సంబందం లేకండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మార్కెట్ లో రకరకాల ఐస్‌క్రీమ్ లు ఉన్నాయి. ఇటీవల కాలంలో ముఖ్యంగా టర్కిష్‌ ఐస్‌క్రీం..

Ice Cream Video: ఐస్‌ క్రీం కోసం కోపంతో ఊగిపోయిన చిన్నారి.. ఆటపట్టిస్తే ఇలాగే ఉంటుంది మరి..
Ice Cream Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 25, 2022 | 7:11 AM

ఐస్‌క్రీం అంటే ఇష్టపడనివారుండరు. చిన్నా, పెద్దా, ఆడా, మగా అనే సంబందం లేకండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మార్కెట్ లో రకరకాల ఐస్‌క్రీమ్ లు ఉన్నాయి. ఇటీవల కాలంలో ముఖ్యంగా టర్కిష్‌ ఐస్‌క్రీం బాగా ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే అక్కడ ఈ ఐస్‌క్రీమ్‌ అమ్మేవాళ్లు కస్టమర్లను ఆకర్షించేందుకు పలురకాల టెక్నిక్‌లు చేస్తుంటారు. దాంతో ఈ ఐస్‌క్రీం బాగా పాపులర్‌ అయిపోయింది. ఇదే సమయంలో ఈ టర్కిస్‌ ఐస్‌క్రీమ్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే సమయంలో ఓ ఫన్నీ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో ఓ ఐస్‌క్రీం బండి దగ్గరకి ఓ చిన్నారి వచ్చి ఐస్‌క్రీం అడుగుతుంది. కౌంటర్‌లో ఉన్న వ్యక్తి ఆ చిన్నారికి ఐస్‌క్రీం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసేసుకుంటాడు. తన ట్రిక్స్‌తో పాపను ఆటపట్టిస్తూ ఉంటాడు. ఐస్ క్రీం కోసం చేయి చాపిన ప్రతీసారి అతను మ్యాజిక్‌ చేసి ఖాళీ కోన్‌ను ఇస్తుంటాడు. అతని పిచ్చి చేష్టలకు బెదిరిపోయిన చిన్నారి ఏడవడం మొదలు పెట్టింది. అయినా అతను ఆ పాపకు ఐస్‌క్రీం ఇవ్వకుండా అలాగే ఆటపట్టిస్తుంటాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ చిన్నారి ఖాళీ కోన్‌ను అతనిపైకి విసిరేస్తుంది. ఎట్టకేలకు ఆ పాప తండ్రి ఆమెను ఎత్తుకుని ఐస్‌క్రీమ్ చిన్నారి చేతికి అందేలా చేస్తాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఓ యూజర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. వందల్లో లైక్‌ చేయగా చాలామంది ఐస్‌క్రీం అమ్యే వ్యక్తి తీరుకు మండిపడ్డారు. పిల్లలకు ఐస్‌క్రీం అంటే ఎంతో ఇష్టం. ఈ విషయంలో వారిని ఏడిపిస్తే పర్యవసానం తీవ్రంగా ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు.