Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Murder Case: శ్రద్ధను సిగరెట్లతో కాల్చిన అఫ్తాబ్..అయినప్పటికీ అతనికి మరో అవకాశం ఇద్దామని కోరిందన్న శ్రద్ధ ఫ్రెండ్స్

అఫ్తాబ్ దగ్గరకు వెళ్లి.. శ్రద్ధలను హింసించినా, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించామని  శుక్లా చెప్పారు. అయితే తమని శ్రద్దా వారిస్తూ.. అతనికి మరో అవకాశం ఇవ్వమని శ్రద్ధా కోరింది.. ఇప్పడు ఏకంగా తన ప్రాణాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Shraddha Murder Case: శ్రద్ధను సిగరెట్లతో కాల్చిన అఫ్తాబ్..అయినప్పటికీ అతనికి మరో అవకాశం ఇద్దామని కోరిందన్న శ్రద్ధ ఫ్రెండ్స్
Shraddha Murder Case
Follow us
Surya Kala

|

Updated on: Nov 25, 2022 | 7:21 AM

ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో శ్రద్ధా వాకర్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. లివ్ ఇన్ భాగస్వామి అఫ్తాబ్ అమీన్ పూనావాలా నిరంతరం శ్రద్ధను వేధిస్తూ ఉండేవాడని ఆమె స్నేహితుడు రజత్ శుక్లా చెప్పారు. శ్రద్దాను  అఫ్తాబ్ సిగరెట్‌తో కాల్చేవాడు.. దారుణంగా హింసించే వాడు.. అయినప్పటికీ  అతనికి ‘ఇంకో అవకాశం’ ఇవ్వాలనే కోరికతో పోలీసులను ఆశ్రయించింది. 2021 సంవత్సరంలో.. అఫ్తాబ్ .. శ్రద్దా  వీపు మీద సిగరెట్‌తో వాతలు పెట్టాడని.. అది తాము చాలా బాధపడ్డామని శుక్లా చెప్పారు.

అంతేకాదు తాము అప్పుడు అఫ్తాబ్ దగ్గరకు వెళ్లి.. శ్రద్ధలను హింసించినా, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించామని  శుక్లా చెప్పారు. అయితే తమని శ్రద్దా వారిస్తూ.. అతనికి మరో అవకాశం ఇవ్వమని శ్రద్ధా కోరింది.. ఇప్పడు ఏకంగా తన ప్రాణాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్‌ను నవంబర్ 12న ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

6 గంటల పాటు అఫ్తాబ్ పాలిగ్రాఫ్ పరీక్ష మీడియా నివేదికల ప్రకారం, శ్రద్ధా హత్య కేసులో అఫ్తాబ్ కు పాలిగ్రాఫ్ పరీక్షలో భాగంగా రెండవ సెషన్ ను రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో నిర్వహించారు. అఫ్తాబ్‌కి 6 గంటల పాటు పాలిగ్రాఫ్ పరీక్ష జరిగింది. మంగళవారం రోహిణి ఎఫ్‌ఎస్‌ఎల్‌లో పూనావాలా పాలిగ్రఫీ పరీక్ష తొలి సెషన్‌ను నిర్వహించారు. పాలిగ్రఫీ పరీక్షను లై డిటెక్టర్ అని కూడా అంటారు. మరోవైపు పూనావాలాకు చెందిన ఐదు కత్తులను ఛతర్‌పూర్ ఫ్లాట్‌లో ఢిల్లీ పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మేలో పూనావాలా శ్రద్ధా వాకర్ (27)ని గొంతు కోసి హత్య చేసి.. అనంతరం ఆ మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలోని తన ఇంట్లో 300 లీటర్ల ఫ్రిజ్‌లో మూడు వారాల పాటు ఉంచారు.  సుమారు 18 రోజుల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆ ముక్కలను విసిరేశాడు. అతని మానసిక, శారీరక ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి అఫ్తాబ్ కు పోలీసులు అనేక పరీక్షలను చేయనున్నారు. అతను అన్ని విధాలా ఫిట్ గా ఉన్నాడు అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే పోలీసులు నార్కో టెస్ట్ చేయగలరు.

మరిన్ని జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..